Hardik Pandya: ‘ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు..?’

Mumbai Indians Captaincy Issue: ఐపీఎల్ 2026 ముందు ముంబై ఇండియన్స్ లో కెప్టెన్సీపై చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. హార్దిక్ పాండ్య స్థానంపై సందేహాలు పెరుగుతుండగా సూర్యకుమార్ యాదవ్ కు నాయకత్వం ఇవ్వాలన్న సూచనలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్ శ్రీకాంత్ వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చాయి.

Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు..?
Mi Hardik Pandya

Updated on: Mar 23, 2026 | 12:18 PM

Mumbai Indians Captaincy Issue: ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ వివాదానికి ఇంకా ముగింపు కనిపించడం లేదు. జట్టు కాగితంపై బలంగా ఉన్నప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. 2020లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన తర్వాత జట్టు మళ్లీ ట్రోఫీ సాధించలేదు. దీంతో నాయకత్వంపై ప్రశ్నలు మరింత పెరిగాయి.

హార్దిక్ పాండ్య రీ ఎంట్రీ తరువాత మారిన పరిస్థితి..

హార్దిక్ పాండ్య 2024లో గుజరాత్ జట్టునుంచి ముంబైలోకి చేరి నేరుగా కెప్టెన్ అయ్యాడు. అతను 2022లో గుజరాత్ కు టైటిల్ అందించినప్పటికీ ముంబైలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయాడు. 2024లో జట్టు చివరి స్థానంలో నిలవడం అభిమానుల్లో అసంతృప్తిని పెంచింది.

ప్లే ఆఫ్స్ చేరినా ట్రోఫీ దక్కలేదు..

2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ కొంత మెరుగుపడి ప్లే ఆఫ్స్ చేరింది. అయినప్పటికీ టైటిల్ దక్కకపోవడంతో కెప్టెన్సీ మార్పు అవసరమా అన్న చర్చ మళ్లీ మొదలైంది. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోతే ఫలితాలు రావని విశ్లేషకులు భావిస్తున్నారు.

శ్రీకాంత్ కీలక సూచనలు..

మాజీ భారత క్రికెటర్ శ్రీకాంత్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు యాజమాన్యం రోహిత్ శర్మ హార్దిక్ పాండ్య సూర్యకుమార్ యాదవ్ ముగ్గురితో కలిసి భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించాడు. సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ప్రయత్నించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ వైపు చూపులు..

ఇటీవల టీ 20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టును విజయవంతంగా నడిపించిన సూర్యకుమార్ యాదవ్ నాయకత్వానికి మంచి మార్కులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ లో కూడా అతనికి కెప్టెన్సీ ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. జట్టులో ఇద్దరు వరల్డ్ కప్ విజేత కెప్టెన్లు ఉండటం ఆసక్తికర పరిస్థితిగా మారింది.

హార్దిక్ స్వయంగా తప్పుకుంటేనే పరిష్కారం..

శ్రీకాంత్ అభిప్రాయం ప్రకారం హార్దిక్ పాండ్య స్వయంగా కెప్టెన్సీ బాధ్యతలు వదులుకుంటే సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. సూర్యకుమార్ యాదవ్ కు నాయకత్వం అప్పగించి తాను జట్టుకు మద్దతు ఇస్తే జట్టు వాతావరణం మెరుగుపడుతుందని సూచించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us