భారత యువ క్రికెటర్‌పై అత్యాచార కేసు నమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు..
మాజీ ముంబై ఇండియన్స్ క్రికెటర్ శివాలిక్ శర్మపై జోధ్‌పూర్‌లో అత్యాచారం, మోసం ఆరోపణలు నమోదయ్యాయి. ఒక యువతి, శివాలిక్ తనతో శారీరక సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించింది. తరువాత, శివాలిక్ కుటుంబం వివాహానికి నిరాకరించింది. ఈ ఘటనతో రాజస్థాన్‌లో కేసు నమోదు కాగా, శివాలిక్ శర్మ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

మరో యువ భారత క్రికెటర్, ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు శివాలిక్ శర్మపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. శివాలిక్ శర్మ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు తనను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఒక యువతి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. దీంతో శివాలిక్ శర్మపై రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మోసం, అత్యాచారం కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం నేను బరోడా పర్యటనకు వెళ్లినప్పుడు ఐపీఎల్ ప్లేయర్ శివాలిక్ శర్మను కలిశాను. మేమిద్దరం స్నేహితులమయ్యాం. నేను జోధ్‌పూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత, మేమిద్దరం ఫోన్లలో మాట్లాడుకున్నాం.
దాదాపు 7 నెలల తర్వాత జోధ్‌పూర్‌లో వారి కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత, మే 2024లో శివాలిక్ జోధ్‌పూర్‌లోని నా ఇంటికి వచ్చి, నేను నిరాకరించినప్పటికీ, నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, నాతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇది చాలా రోజులు ఇలాగే కొనసాగింది. కొంత సమయం తర్వాత శివాలిక్ మునే మా కుటుంబాన్ని వివాహం గురించి మాట్లాడటానికి బరోడాకు రమ్మని అడిగాడు.
మా కుటుంబం వివాహ చర్చల కోసం బరోడా వెళ్ళినప్పుడు, శివాలిక్ తల్లిదండ్రులు “మా కొడుకు ఐపీఎల్ ఆటగాడు” ఇక మీతో సంబంధం పెట్టుకోలేం అని మమ్మల్ని తిట్టారు. అతనికి చాలా మంది అమ్మాయిల నుండి ప్రపోజల్లు వస్తున్నాయి. కాబట్టి మీ కూతురిని పెళ్లి చేసుకోలేమని చెప్పి ఇంటి నుండి వెళ్ళగొట్టారు. వివాహం గురించి మాట్లాడటానికి శివాలిక్ వద్దకు వెళ్ళినప్పుడు, “ఈ విషయం ఎవరికైనా చెబితే, నేను మీ ప్రతిష్టను నాశనం చేస్తాను” అని శివాలిక్ తనను బెదిరించాడని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




