Viral Video: మీ నిగ్రహానికి అగ్నిపరీక్ష.. ఈ వీడియో చూశాక చప్పట్లు కొట్టకుండా ఉండగలిగితే మీరు కేక..

|

Feb 19, 2023 | 7:22 PM

ఆటలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక సెలవు దొరికితే చాలు.. ఒక్కరు ఒక్కోస్టైల్లో కొహ్లీ, సచిన్‌, ధోనీ.. ఇలా తమ ఫేవరెట్‌ క్రికెటర్ల అవతారం ఎత్తేస్తారు. క్రికెట్‌ ఆట ఆడటంలో ఉండే మజా ఆడేవారికే కాదు చూసేవారికి కూడా బాగా వంటబడుతుంది...

Viral Video: మీ నిగ్రహానికి అగ్నిపరీక్ష.. ఈ వీడియో చూశాక చప్పట్లు కొట్టకుండా ఉండగలిగితే మీరు కేక..
Viral Video
Follow us on

ఆటలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక సెలవు దొరికితే చాలు.. ఒక్కరు ఒక్కోస్టైల్లో కొహ్లీ, సచిన్‌, ధోనీ.. ఇలా తమ ఫేవరెట్‌ క్రికెటర్ల అవతారం ఎత్తేస్తారు. క్రికెట్‌ ఆట ఆడటంలో ఉండే మజా ఆడేవారికే కాదు చూసేవారికి కూడా బాగా వంటబడుతుంది. ఐతే మీరిప్పటి వరకు చూసిన క్రికెట్‌లలో బాల్‌ క్యాచ్ పట్టే సందర్భాల్లో ఆటగాళ్ల ఫీట్లు చూసే ఉంటారు. ఒక్కోసారి కిందామీదాపడి బాల్‌ క్యాచ్‌ పట్టినా బౌండరీ దాటి బయటికి పోవడమో.. ఇంకోలానో.. క్యాచ్‌ మిస్‌ అవుతుంది. ఐతే ఇతగాడు అటువంటి కోవకు చెందిన వాడు కాదండి.. పరమ వీర విక్రమార్కుడు. బాల్‌ క్యాచ్‌ పట్టాడు. ఐతే అంతలోనే బౌండరీ లైన్‌ దాటి అవతలికి పడబోయాడు. ఒకవేళ పడితే క్యాచ్‌పట్టినా పలితం ఉండదు కదా! అందుకనీ ఓ తెలివైన పని చేశాడు. గీత అవతల పడేలోపు బాల్‌ని పైకి విసిరాడు. అది పైకి ఎగిరి కిందపడే లోపల.. గీత బయటికి వెళ్లిన అతగాడు కాలితో ఒక్కతన్ను తన్నాడు. అంతే బాల్‌ కిందపడకుండా మళ్లీ పైకి పోయి గీత ఇవతల పడేలోపు ఫీల్డర్‌ వచ్చి క్యాచ్‌ పట్టారు. అబ్బురపరిచేలా ఉన్న అతని ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇండియన్‌ క్రికెట్ చరిత్రలో ఈ అల్టిమేట్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. క్రికెట్ దిగ్గజం ఓంకార్ మంకమే తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత తాము క్రికెట్‌ మైదానంలో లేకపోయినప్పటికీ విజిల్స్‌ వేసి మరీ చప్పట్లు కొడుతున్నారు వీక్షకులు. ఇలాంటి వాడు మన ఇండియన్‌ క్రికెట్‌ టీంలో ఎందుకు లేడా..? అని మరికొందరు తెగ బాధపడిపోతున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ స్థానికంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌ అని తెలుస్తోంది. బౌండరీ దగ్గర అద్భుతమై క్యాచ్ పట్టిన స్టార్ ఫీల్డింగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరూ ఓ లుక్కేసుకోండి.. ప్రతిభ ఎక్కడున్నా అభినందించడంతో తప్పులేదు సుమీ..!

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.