AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : తెల్ల గడ్డంతో కనిపించిన కోహ్లీని చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. ఇన్నాళ్లు అలా మేనేజ్ చేశావా బ్రో అంటూ కామెంట్స్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల ఒక ఫొటోలో కనిపించి, సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాడు. ఆ ఫొటోలో అతని తెల్ల గడ్డం అభిమానుల ఆందోళనకు దారితీసింది. 36 ఏళ్ల కోహ్లీ ఇటీవల టీ20, టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకుంటాడా అని అభిమానులు సందేహిస్తున్నారు.

Virat Kohli : తెల్ల గడ్డంతో కనిపించిన కోహ్లీని చూసి షాకవుతున్న ఫ్యాన్స్..  ఇన్నాళ్లు అలా మేనేజ్ చేశావా బ్రో అంటూ కామెంట్స్
Virat Kohli
Rakesh
|

Updated on: Aug 08, 2025 | 1:39 PM

Share

Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. లండన్‌లో ఒక వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలో కోహ్లీ గడ్డం తెల్లగా కనిపించడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఈ ఫోటో వైరల్ అవడంతో, కోహ్లీ వన్డే ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ వయసు 36 ఏళ్లు కావడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

విరాట్ కోహ్లీ ఇటీవల లండన్‌లో శశాంక్ పటేల్ అనే వ్యక్తితో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోలో కోహ్లీ గడ్డం పూర్తిగా తెల్లగా కనిపించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడేమో అని కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా కోహ్లీ గడ్డం తెల్లగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. జూలై 2023లో అనుష్క శర్మతో కలిసి దిగిన ఫోటోలో కూడా కోహ్లీ గడ్డం తెల్లగా కనిపించింది. ఎంఎస్ ధోనీలాగే కోహ్లీకి కూడా చిన్న వయసులోనే గడ్డం తెల్లగా మారిపోయింది.

జూలై 10న యువరాజ్ సింగ్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కోహ్లీ తన గడ్డం గురించి ఒక సరదా వ్యాఖ్య చేశారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ నిర్ణయం గురించి వివరిస్తూ.. “నేను రెండు రోజుల క్రితమే నా గడ్డానికి రంగు వేసుకున్నాను. మీరు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి గడ్డానికి రంగు వేసుకుంటున్నారంట ఆ సమయం వచ్చిందని అర్థం” అని కోహ్లీ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు కోహ్లీ తెల్ల గడ్డం ఫోటో వైరల్ అవడం, దానిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

కోహ్లీ గత ఏడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది మే 12న టెస్ట్ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోహ్లీ ఈ నెలలో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో తిరిగి వస్తాడని అనుకున్నారు. కానీ ఆ సిరీస్ వాయిదా పడింది. ఇప్పుడు అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా పర్యటనతో తిరిగి మైదానంలోకి వస్తారని అంచనా. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..