Women’s World Cup : మహిళల ప్రపంచ కప్‌లో బురఖా వేసుకుని ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు?.. వైరల్ అవుతున్న ఫోటో నిజమా? ఫేకా ?
ప్రస్తుతం భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 జరుగుతోంది. వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో భారత్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి 8 జట్లతో పాటు బంగ్లాదేశ్ జట్టు కూడా పాల్గొంటోంది. అయితే, ఈ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Women’s World Cup : ప్రస్తుతం భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 జరుగుతోంది. వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో భారత్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి 8 జట్లతో పాటు బంగ్లాదేశ్ జట్టు కూడా పాల్గొంటోంది. అయితే, ఈ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో బంగ్లాదేశ్ క్రీడాకారిణులు బురఖా ధరించి క్రికెట్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో అసలు బంగ్లాదేశ్ మహిళలు నిజంగానే బురఖా వేసుకుని ప్రపంచ కప్‌లో ఆడుతున్నారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
నిగర్ సుల్తానా కెప్టెన్సీలో బంగ్లాదేశ్ మహిళా జట్టు ప్రపంచ కప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తోంది. టోర్నీలో తమ మొదటి మ్యాచ్‌లోనే ఆ జట్టు పాకిస్తాన్‌ను ఓడించి సత్తా చాటింది. అంతేకాకుండా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లను కూడా గట్టిగా ఇబ్బంది పెట్టింది. అయితే, మైదానంలో క్రీడాకారిణులు పోరాడుతుంటే సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఒక ఫోటో మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఒక ఫోటో విపరీతంగా షేర్ అవుతోంది. ఆ ఫోటోలో మైదానంలో బురఖా ధరించిన ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. వారిలో ఒకరి చేతిలో బ్యాట్ ఉంది. ఆ ఫోటోపై ప్రపంచ కప్ 2025 స్కోర్‌బోర్డు గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. స్కోర్‌బోర్డు ప్రకారం.. ఆ ఫోటో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మ్యాచ్‌దిగా చూపిస్తోంది. కొందరు ఈ ఫోటోను బంగ్లాదేశ్ లోకల్ టోర్నమెంట్‌కు సంబంధించినదని చెబితే, మరికొందరు బంగ్లాదేశ్ జట్టును ఆటపట్టించడానికి ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.
మరి ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. బంగ్లాదేశ్ మహిళా క్రీడాకారిణులు నిజంగానే ప్రపంచ కప్‌లో బురఖా ధరించి ఆడరు. ఈ వైరల్ అవుతున్న ఫోటో పూర్తిగా ఎడిట్ చేసింది. ఇది పూర్తిగా ఫేక్. బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ దేశం అయినప్పటికీ ఆ దేశానికి చెందిన మహిళా క్రికెటర్లు టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ఇతర మహిళా క్రీడాకారిణుల మాదిరిగానే సాధారణ జెర్సీ, క్రికెట్ కిట్‌ను ధరించి ఆడుతున్నారు. బురఖా ధరించి ఆడుతున్నారనే వాదనలు, ఫోటోలు పూర్తిగా నిరాధారమైనవి. తప్పుడు ప్రచారంలో భాగమే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
