IPL 2023: ‘టోర్నీ ఫైనల్‌‌కి ముంబై ఇండియన్స్ చేరడం కష్టమే’.. వ్యాఖ్యానించిన సన్‌రైజర్స్‌ మాజీ కోచ్‌.. ఇంకా ఏమన్నారంటే..?

|

Apr 05, 2023 | 4:03 PM

ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ముంబై ఇండియన్స్‌పై టోర్నీ ఆరంభదశ నుంచే విమర్శల పర్వం మొదలైంది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ మాజీ కోచ్ కూడా తనదైన మాటలతో విమర్శించారు. గతేడాది కనబర్చిన ప్రదర్శననే ముంబై ఇండియన్స్

IPL 2023: ‘టోర్నీ ఫైనల్‌‌కి ముంబై ఇండియన్స్ చేరడం కష్టమే’.. వ్యాఖ్యానించిన సన్‌రైజర్స్‌ మాజీ కోచ్‌.. ఇంకా ఏమన్నారంటే..?
Mumbai Indians
Follow us on

ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభమవడంతో క్రికెట్ అభిమానులు మంచి జోష్‌లో ఉన్నారు. ఇక ఐపీఎల్ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్‌కి అద్భుతమైన స్థానం, ఫ్యాన్‌బేస్ ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 15 సీజన్లు జరిగితే వాటిలో 5 టోర్నీలకు విజేతగా ఆ జట్టే నిలిచింది. కానీ గతేడాది జరిగిన ఐపీఎల్‌ సీజన్‌‌లో తీవ్రంగా నిరాశపరిచిన ముంబై.. ఈ ఏడాది అంటే సీజన్ 16లో కూడా ఓటమితోనే టోర్నీని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ముంబై ఇండియన్స్‌పై టోర్నీ ఆరంభదశ నుంచే విమర్శల పర్వం మొదలైంది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ మాజీ కోచ్ కూడా తనదైన మాటలతో విమర్శించారు. గతేడాది కనబర్చిన ప్రదర్శననే ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌(16వ సీజన్)లో కూడా ప్రదర్శించిందని, ఇలాగే మున్ముందు కూడా కొనసాగితే ఫైనల్ చేరుకోవడం కష్టమేనని ఆరెంజ్ ఆర్మీ మాజీ కోచ్ టామ్ మూడీ అన్నారు.

‘ముంబై ఇండియన్స్ కనబరుస్తున్న పేలవ ప్రదర్శనపై ఆందోళనగా ఉంది. ఐపీఎల్‌ 16వ సీజన్ ప్రారంభానికి ముందు కూడా నేను ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ముంబై ఇండియన్స్ ఈ టోర్నీలో ఫైనల్ వరకు చేరగలుగుతారని నేను అనుకోవడంలేదు. రోహిత్‌ నాయకత్వంలోని ముంబై టీమ్‌లో చాలా లోపాలున్నాయి. టీమ్‌లో బ్యాలెన్స్‌గా లేదు. ఏ స్థానంలో వచ్చి బౌలింగ్ చేయాలన్నా ముందుండే బౌలర్లు ఆ టీమ్‌లో ఇప్పుడు లేర’ని టామ్ మూడీ ఓ ఛానల్‌‌తో ముంబై టీమ్ గురించి తన విశ్లేషణను తెలియజేశారు.

కాగా, ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు టోర్నీ విజేతగా నిలిచిన రోహిత్ సేన గతేడాది నుంచి తన పట్టును కోల్పోయింది. గతేడాది ఆడిన 14 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది కూడా తొలి మ్యాచ్ నుంచే పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 8 వికెట్ల తేడాతో ఓడిన రోహిత్ సేన.. ఈ నెల 8న చెన్నై సూపర్ కింగ్స్‌తో తన రెండో మ్యాచ్ ఆడబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..