
Girl Meeting MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో అయినా, బయట అయినా ఆయన కనిపిస్తే చాలు అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. తాజాగా, ఓ పుట్టినరోజు వేడుకలో ధోనీని కలిసిన ఓ యువతి ఇచ్చిన హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు.
అసలేం జరిగిందంటే?
ఇటీవల స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు ఎంఎస్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి హాజరయ్యారు. ఈ పార్టీలోనే ఓ యువతి ధోనీని కలిసే అవకాశం దక్కించుకుంది. తన అభిమాన క్రికెటర్‌ను అంత దగ్గరగా చూసేసరికి ఆమె ఆశ్చర్యంతో కూడిన ఆనందంలో మునిగిపోయింది. ధోనీ ఆమెతో మాట్లాడుతుండగా, ఆ యువతి కళ్లార్పకుండా ఆరాధనగా ఆయన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమె ముఖంలో పలికిన ఆనందం, ఆశ్చర్యం ఇంకా ఎన్నో హావభావాలు కెమెరాలో బంధీ అయ్యాయి.
ఆ తర్వాత ధోనీతో కలిసి ఫొటో దిగే అవకాశం రావడంతో ఆమె ఆనందం రెట్టింపైంది. ధోనీ పక్కన నిల్చున్నప్పుడు కూడా ఆమె చూపు తిప్పుకోలేకపోయింది. ‘మిమ్మల్ని కలవడం నా కల’ అన్నట్లుగా ఆమె కళ్లు చెప్పకనే చెబుతున్నాయి. పార్టీ ముగిసి అందరూ వెళ్తున్న సమయంలో కూడా ఆమె ధోనీ వైపే చూస్తూ ఉండిపోయింది. ఈ మొత్తం సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో..
— Aroan Roy (@aroan_roy8065) June 23, 2025
ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు అభిమానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “నిజమైన అభిమానం అంటే ఇదే,” “ఆమె కళ్లల్లోని ఆనందం వెలకట్టలేనిది,” “ధోనీని కలిస్తే ఎవరికైనా ఇలాగే ఉంటుంది,” “ఎంత అదృష్టవంతురాలు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ధోనీపై అభిమానం ఎలాంటిదో ఈ ఒక్క వీడియో స్పష్టం చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా ధోనీ బహిరంగ కార్యక్రమాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటిది ఇలాంటి పార్టీల్లో ఆయనను చూసే అవకాశం లభించడం అభిమానులకు పండగే. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..