PAK vs ENG, T20 WC Final: బెన్ స్టోక్స్‌ విరోచిత పోరాటం.. టీ20 వరల్డ్‌ కప్‌ ఇంగ్లండ్‌ కైవసం..

|

Nov 13, 2022 | 5:32 PM

టీ20 వరల్డ్‌ కప్‌ను ఇంగ్లండ్‌ ఎగరేసుకుపోయింది. ఫైనల్‌ మ్యాచ్‌లో సునాయాసంగా విజయాన్ని ముద్దాడింది. ఓవైపు ఇంగ్లండ్‌ బౌలర్లు పాక్‌ను కట్టడి చేయడంలో విజయవంతమైతే, మరోవైపు బ్యాటర్లు లక్ష్యాన్ని చేధించడంలో సక్సెస్‌ అయ్యారు. దీంతో ఇంగ్లండ్‌ వరల్డ్‌ కప్‌ను తన ఖాతాలో వేసుకుంది...

PAK vs ENG, T20 WC Final: బెన్ స్టోక్స్‌ విరోచిత పోరాటం.. టీ20 వరల్డ్‌ కప్‌ ఇంగ్లండ్‌ కైవసం..
England Won The Match
Follow us on

టీ20 వరల్డ్‌ కప్‌ను ఇంగ్లండ్‌ ఎగరేసుకుపోయింది. ఫైనల్‌ మ్యాచ్‌లో సునాయాసంగా విజయాన్ని ముద్దాడింది. ఓవైపు ఇంగ్లండ్‌ బౌలర్లు పాక్‌ను కట్టడి చేయడంలో విజయవంతమైతే, మరోవైపు బ్యాటర్లు లక్ష్యాన్ని చేధించడంలో సక్సెస్‌ అయ్యారు. దీంతో ఇంగ్లండ్‌ వరల్డ్‌ కప్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా 12 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌ను గెలుచుకొని సరికొత్త చరిత్రను లిఖించారు. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ బెన్‌ స్టోక్స్‌ హాఫ్‌ సెంచరీ (52)తో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి విజయం సాధిచింది. దీంతో రెండోసారి వరల్డ్‌ కప్‌ను తన ఖాతాలో వేసుకుంది ఇంగ్లండ్‌. ఇక టీ20 వరల్డ్‌ కప్‌ అందుకున్న ఇంగ్లండ్‌కు రూ. 12 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్‌ రూ. 6.5 కోట్లు అందుకోనుంది.

ఇక అంతకు ముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 138 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లు రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులను మాత్రమే చేసింది. షాన్‌ మసూద్ (38), బాబర్ అజామ్ (32), షాదాబ్‌ ఖాన్ (20) పర్వాలేదనిపించారు. ఇఫ్తికార్‌ అహ్మద్ డకౌట్‌ కాగా.. మహమ్మద్ రిజ్వాన్ 15, హారిస్ 8, నవాజ్ 5, మహమ్మద్‌ వాసిమ్‌ జూనియర్‌ 4, షహీన్‌ షా అఫ్రిది 5* పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు సామ్‌ కరన్ 3, అదిల్ రషీద్‌ 2, క్రిస్‌ జొర్డాన్ 2, బెన్ స్టోక్స్ ఒక వికెట్‌ తీశారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ విషయానికొస్తే బెన్‌ స్టోక్స్‌ 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 52 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. జోస్‌ బట్లర్‌ 26, హారీ బ్రూక్‌ 20, మోయిన్‌ అలీ 19 పరుగులు చేశారు. పాకిస్థాన్‌ బౌలింగ్‌ విషయానికొస్తే హారిస్‌ రౌఫ్‌ రెండు వికెట్లు తీసుకోగా షాహీన్‌ అఫ్రీది, షాహబ్‌ ఖాన్‌, మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌ ఒక్కో వికెట్ తీసుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..