మహిళల క్రికెట్ ప్రపంచకప్(Women’s World Cup)లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. వెస్టిండీస్(england vs west indies)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకుముందు వెస్టిండీస్ మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో వెస్టిండీస్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. రెండు మ్యాచ్‌ల్లో రెండు ఓటములతో ఇంగ్లండ్ పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి కంటే వెస్టిండీస్‌కు చెందిన డియాండ్రా డాటిన్(Deandra Dottin)పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. గాలిలోకి దూకుతూ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో, నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్ ఓపెనర్ లారెన్ విన్‌ఫీల్డ్ కొట్టిన ఓ బంతిని డియాండ్రా పాయింట్ మీద ఫీల్డింగ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకుంది. ఒక చేత్తో తన ఎడమవైపు గాలిలోకి ఎగురుతూ ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టుకుంది. క్యాచ్ పట్టే టైంలో ఆమె పూర్తిగా గాలిలోనే ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళల జట్టు డియాండ్రా డాటిన్ (64 బంతుల్లో 31), హేలీ మాథ్యూస్ (58 బంతుల్లో 45) 81 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం చేసింది. తొలి బంతికే కెప్టెన్ స్టెఫానీ టేలర్ ఔటైంది. షెమైన్ క్యాంప్‌బెల్ (80 బంతుల్లో 66), చెదన్ నేషన్ (74 బంతుల్లో 49) ఐదో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. వెస్టిండీస్ 6 వికెట్లకు 225 పరుగులు చేసింది.
72 పరుగులకే నాలుగు వికెట్లు పడిపోవడంతో ఇంగ్లండ్‌కు పేలవ ఆరంభం లభించింది. 36ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత ఎక్లెటన్ (33*), క్రాస్ (27) ఇంగ్లండ్ టీంను విజయానికి దగ్గరగా తీసుకెళ్లారు. అయితే, చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్‌కు కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా.. క్రాస్ రనౌట్‌గా వెనుదిరిగింది. మూడు బంతుల తర్వాత అన్య ష్రుబ్సోల్ స్పిన్నర్ అనిస్సా మహ్మద్ బౌలింగ్‌లో ఔటయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్యాంప్‌బెల్ నాలుగు వికెట్లు పడగొట్టింది.
Diving Deandra Dottin takes a screamer in West Indies’ 7 run win over England at the World Cup.@abcsport #CWC22 #ENGvWI
vision: Fox Sports pic.twitter.com/GFL4yctvtZ— Duncan Huntsdale (@duncs_h) March 9, 2022
Also Read: 18 బంతుల్లో 9 పరుగులు చేయలేకపోయిన ఇంగ్లాండ్.. వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమి..
AUS vs PAK: ఆసీస్ దెబ్బకు పాక్ విలవిల.. వరుసగా రెండో ఓటమి.. ప్రపంచకప్‌లో సంక్షిష్టంగా మారిన అవకాశాలు