England vs Pakistan: పాకిస్తాన్ బౌలర్ దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న ఇంగ్లండ్ ప్లేయర్లపై, ఆ దేశ అభిమానులు ఫైర్ అయ్యారు. అసలు అలాంటి చెత్త ప్రదర్శనను వారు ఊహించలేకోవడంతో.. ఇంగ్లండ్ ఆటగాళ్లపై విరుచకపడ్డారు. ఎంతోమంది లెజండరీ బ్యాట్స్‌మెన్లతో కూడిన ఆజట్టు కేవలం 2 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోవడమే ఇందుకు కారణం. దాంతో అసలు ఆ జట్టులోని ఆటగాళ్లను పక్కన పెట్టండని గొడవ కూడా చేశారు. అలాంటి మ్యాచ్ 1992 జులై 26న జరిగింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్ ఆడుతున్న ఇంగ్లండ్ మొదట్లో బాగానే ఆడింది. 2 వికెట్లు కోల్పోయి 292 పరుగులతో మంచి స్థితిలో కనిపించింది. కానీ, అనంతరం 320 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఆరు వికెట్లు కేవలం రెండు పరుగుల వ్యవధిలో పడిపోయాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 197 పరుగులు చేసింది. సలీం మాలిక్ 82 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ తరపున నీల్ మెలాండర్ 3 వికెట్లు, క్రిస్ లూయిస్, డెరెక్ ప్రింగిల్, టిమ్ మాంటన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 320 పరుగులు చేసింది. మొదటి ముగ్గురు బ్యాట్స్ మెన్ పాకిస్తాన్ బౌలర్లను అడ్డుకున్నారు. ఇందులో కెప్టెన్ గ్రాహం గూచ్ 135, మైక్ ఎర్త్టన్ 76 పరుగులతో బాగానే ఆకట్టుకున్నారు. మూడవ స్థానంలో రాబిన్ స్మిత్ 42 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ బౌలర్లలో వకార్ యూనిస్ ఐదు వికెట్లు పడగొట్టాడు. 2 వికెట్లకు 292 పరుగులతో ఉన్న ఇంగ్లండ్.. అనంతరం 320 పరుగులకు కుప్పకూలింది. వకార్ యూనిస్ అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్ల బరతం పట్టాడు. అలాగే మరో బౌలర్ ముష్తాక్ అహ్మద్ కూడా మూడు వికెట్లు తీసి చివర్లో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
సలీం మాలిక్ అసాధారణ ప్రదర్శన..
రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ జట్టుకు సలీం మాలిక్ అండగా నిలబడ్డాడు. అజేయంగా 84 పరుగులు సాధించాడు. ఆయనతో పాటు రమీజ్ రాజా 63 పరుగులు అందించాడు. మిగతా బ్యాట్స్ మెన్ ప్రత్యేకంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ల సహాయంతో పాకిస్తాన్ జట్టు 221 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 99 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.అయితే ఈ స్కోర్ అంత కష్టం కాదు. కానీ, ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో గ్రాహం గూచ్ 37, డేవిడ్ గోవర్ 31 పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఈ ఇన్నింగ్స్‌లో వకార్ యూనిస్ రెండు వికెట్లు పడగొట్టగా, ముష్తాక్ అహ్మద్ కూడా రెండు వికెట్లు తీశాడు.
Also Read: Tokyo Olympics 2020: పతకానికి అడుగు దూరం.. అరంగేట్ర ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ అరుదైన రికార్డు!