IND vs ENG: తొలి టెస్ట్‌కు కొన్ని గంటలముందే టీమిండియాకు బిగ్ షాక్.. ట్రిపుల్ సెంచరీ ప్లేయర్ ఔట్..?

England vs India, 1st Test: తొలి టెస్టుకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో, కీలక బ్యాటర్లలో ఒకరి గాయం, నెట్స్‌లో తడబాటు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంగ్లాండ్‌లో పేస్, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు నిలదొక్కుకోవడం చాలా ముఖ్యం.

IND vs ENG: తొలి టెస్ట్‌కు కొన్ని గంటలముందే టీమిండియాకు బిగ్ షాక్.. ట్రిపుల్ సెంచరీ ప్లేయర్ ఔట్..?
Ind Vs Eng 1st Test

Updated on: Jun 20, 2025 | 11:25 AM

భారత్-ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠభరితమైన ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభానికి రెండు రోజుల ముందు, భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం (జూన్ 20) నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా, కీలకమైన బ్యాటర్లలో ఒకరు నెట్స్‌లో తీవ్రంగా తడబడుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ ఆటగాడి గడ్డు పరిస్థితి, రాబోయే సిరీస్‌లో జట్టు బ్యాటింగ్ లైనప్‌పై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెట్స్‌లో కరుణ్ నాయర్‌కు గాయం, ఫామ్ సమస్యలు..

తాజా నివేదికల ప్రకారం, భారత జట్టులో చాలా కాలం తర్వాత తిరిగి చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ (Karun Nair) నెట్స్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతి నేరుగా నాయర్‌కు కడుపుకు బలంగా తగలడంతో, పక్కటెముకకు గాయమైనట్లు సమాచారం. ఈ గాయం తర్వాత తిరిగి బ్యాటింగ్ ప్రారంభించినప్పటికీ, అతను ఇబ్బంది పడుతూ కనిపించాడు.

ఒక బ్యాట్స్‌మెన్‌కు ఇలాంటి గాయం, ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌కు ముందు, అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. గతంలో ట్రిపుల్ సెంచరీ సాధించిన నాయర్, మళ్లీ టెస్టు జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వడం ఒక పెద్ద అవకాశం. కానీ ఈ గాయం, నెట్స్‌లో అతని తడబాటు, తుది జట్టులో అతని స్థానాన్ని ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది.

జట్టు కూర్పుపై ప్రభావం..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, యువ కెప్టెన్ శుభమాన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు కొత్త శకానికి సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో, కరుణ్ నాయర్ వంటి అనుభవజ్ఞులైన బ్యాటర్ల ఫామ్ జట్టుకు చాలా కీలకం.

తొలి టెస్టు కోసం భారత తుది జట్టులో చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నిన్నటి ప్రెస్ మీట్‌లో నాలుగో స్థానంలో గిల్, ఐదో స్థానంలో తాను బ్యాటింగ్ చేస్తామని ప్రకటించాడు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. వన్-డౌన్‌లో సాయి సుదర్శన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఆరో స్థానంపై మేనేజ్‌మెంట్‌కు నిన్నటి వరకు ఎలాంటి అనుమానం లేకుండింది. కానీ, ఇప్పుడు కరుణ్ నాయర్ గాయం, అతని ఫామ్ సమస్యలతో, ఆ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవాల్సి రావొచ్చు. ధృవ్ జురెల్ ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్నాడు.

పెరిగిన ఆందోళన..

తొలి టెస్టుకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో, కీలక బ్యాటర్లలో ఒకరి గాయం, నెట్స్‌లో తడబాటు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంగ్లాండ్‌లో పేస్, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు నిలదొక్కుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో, ఒక బ్యాటర్ ఆత్మవిశ్వాసం కోల్పోవడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది.

ఈ పరిస్థితి నుంచి భారత జట్టు ఎలా బయటపడుతుంది, కరుణ్ నాయర్ స్థానంలో ఎవరికి అవకాశం లభిస్తుంది అనేది వేచి చూడాలి. ఈ సిరీస్ భారత యువ జట్టుకు ఒక పెద్ద పరీక్ష.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..