ICC World Cup 2023: ఇంగ్లండ్‌కు బ్యాడ్ న్యూస్.. గాయంతో ప్రపంచకప్‌ నుంచి తప్పుకున్న ప్లేయర్..

ICC World Cup 2023, England: “వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత శనివారం ముంబైలో స్కాన్‌ చేశారు. దీంతో గాయాన్ని పూర్తిగా అంచనా వేశారు. గాయం తీవ్రం కావడంతో టోప్లీ మరో 24 గంటల్లో ఇంగల్ండ్‌కి తిరిగి వెళ్తాడు" అంటూ ప్రకటించింది.

ICC World Cup 2023: ఇంగ్లండ్‌కు బ్యాడ్ న్యూస్.. గాయంతో ప్రపంచకప్‌ నుంచి తప్పుకున్న ప్లేయర్..
England Cricket Team

Updated on: Oct 22, 2023 | 7:29 PM

వరుస పరాజయాలతో సతమతమవుతోన్న ఇంగ్లండ్ టీంకు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. గాయంతో ఓ ఫాస్ట్ బౌలర్ స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. శనివారం ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లీ ఎడమ చూపుడు వేలు విరిగింది. ఈమేరకు నేడు ఐసీసీ ప్రపంచ కప్ 2023 నుంచి వైదొలిగినట్లు ఇంగ్లండ్ జట్టు ప్రకటించింది.

“వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత శనివారం ముంబైలో స్కాన్‌ చేశారు. దీంతో గాయాన్ని పూర్తిగా అంచనా వేశారు. గాయం తీవ్రం కావడంతో టోప్లీ మరో 24 గంటల్లో ఇంగల్ండ్‌కి తిరిగి వెళ్తాడు” అంటూ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

“టోప్లీ తన పునరావాసానికి సంబంధించి ఇంగ్లాండ్, సర్రే వైద్య బృందాలతో కలిసి పని చేస్తాడు. భర్తీని నిర్ణీత సమయంలో ప్రకటిస్తాం’’ అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us