వీడెవడండీ బాబు.. PSL ఆడొద్దన్నందుకు బిగ్ షాక్ ఇచ్చాడుగా.. కెప్టెన్సీతోపాటు స్వదేశాన్నే విడిచిపెట్టేశాడు
James Vince: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025తోపాటు ఐపీఎల్‌ను ఏప్రిల్-మేలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆడేందుకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశాన్నే విడిచి పెట్టి, ఏకంగా దుబాయ్‌కే మకాం మార్చేశాడు. పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు ఎంత జీతం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

James Vince Leaves Hampshire Captaincy: ఈసారి పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025ను ఐపీఎల్‌తో పాటు ఏప్రిల్-మేలో నిర్వహించనున్నారు. ఇందులో ఆడేందుకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్ కీలక అడుగు వేశాడు. ఇంగ్లీష్ బోర్డ్ అతనికి NOC ఇవ్వడానికి నిరాకరించడంతో అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కౌంటీ జట్టు హాంప్‌షైర్ కెప్టెన్సీకి కూడా రాజీనామా చేశాడు. తొమ్మిదేళ్లపాటు ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. జేమ్స్ విన్స్‌ను కరాచీ కింగ్స్ అట్టిపెట్టుకుంది. ఇక్కడ నుంచి అతనికి దాదాపు కోటి రూపాయల మొత్తం లభిస్తుంది. అయితే, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొత్త ఎన్ఓసీ విధానం వల్ల అతని ఆటకు ఇబ్బంది ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు ఈ ఆటగాడు. అయితే, టీ20 జట్టుకు విన్స్ హాంప్‌షైర్ కెప్టెన్‌గా కొనసాగుతాడని చెబుతున్నారు.
జేమ్స్ విన్స్ ఇంగ్లండ్ తరపున 13 టెస్టులు, 25 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. అయితే, అతను మార్చి 2023 నుంచి ఇంగ్లీష్ జట్టుకు ఆడలేకపోయాడు. ఈ క్రమంలో ట్వీట్ చేస్తూ.. హాంప్‌షైర్ కౌంటీ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నాను. హాంప్‌షైర్‌ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇది 16 సంవత్సరాలుగా నా క్లబ్, ఇల్లు. కాబట్టి నేను టీ20 క్రికెట్‌లో హాంప్‌షైర్‌కు మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను. తదుపరి పోటీలలో కూడా అదే విధంగా రాణించాలనుకుంటున్నాను. నా కుటుంబానికి ఏది బెస్ట్, నా కెరీర్‌కు ఏది మంచిదో కూడా చూసుకోవాలి’ అంటూ రాసుకొచ్చాడు.
ఇంగ్లీష్ బోర్డ్ కొత్త విధానం ఏమిటి?
ఇంగ్లిష్ సీజన్ జరుగుతున్నప్పుడు వైట్ బాల్ క్రికెట్ ఆడే ఇంగ్లిష్ ఆటగాళ్లు విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు పేపర్‌వర్క్ అవసరమని ఇంగ్లండ్ బోర్డు కొత్త ఎన్ఓసీ విధానం చెబుతోంది. ఐపీఎల్‌కు మినహాయింపు ఉంటుంది. కానీ, ఇతర లీగ్‌లలో ఆడేందుకు అనుమతి అవసరం. ECB నవంబర్ 2024లో ఈ పాలసీని జారీ చేసింది.
ఇంగ్లాండ్ నుంచి మకాం మార్చిన జేమ్స్ విన్స్..
జేమ్స్ విన్స్ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో నివసించడం మానేశాడు. కుటుంబంతో కలిసి దుబాయ్‌కి మకాం మార్చాడు. ఆయన ఇంటిపై గతేడాది రెండుసార్లు దాడులు జరిగాయి. ఒకసారి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతను దృష్టిలో ఉంచుకుని దుబాయ్‌లో ఇల్లు కట్టుకున్నాడు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో గల్ఫ్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. విన్స్ 2015లో హాంప్‌షైర్‌కు కెప్టెన్ అయ్యాడు. అప్పటి నుంచి అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 197 మ్యాచ్‌లు ఆడాడు. 41.22 సగటుతో పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




