Ben Stokes: ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగల బీభత్సం.. చివరకు వాటిని కూడా వదలకుండా..

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేసిన బెన్ స్టోక్స్.. తన పోస్ట్ లో కొన్ని వస్తువుల ఫొటోలను కూడా షేర్ చేశాడు.

Ben Stokes: ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగల బీభత్సం.. చివరకు వాటిని కూడా వదలకుండా..
England Cricketer Ben Stokes
Follow us

|

Updated on: Oct 31, 2024 | 8:01 PM

ఇంగ్లండ్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ ఇంట్లో దోపిడీ జరిగింది. ఇది జరిగి రెండు వారాల తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. తన ఇంట్లో విలువైన వస్తువులను పోగొట్టుకున్నానంటూ కొన్ని గంటల క్రితం బెన్‌స్టోక్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. తనకు సాయం చేయాలని అధికారులు, ఇంగ్లండ్‌ పౌరులను కోరుతున్నాడు బెన్‌ స్టోక్స్‌. తన ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఫొటోలను కూడా షేర్‌ చేసుకున్నాడు. గత నెల రోజుల నుంచి పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్నాడు ఇంగ్లిష్‌ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌. దీంతో దొంగలు పక్కా స్కెచ్‌తో అతడి ఇంటిని దోచేశారు. అక్టోబర్ 17న ఈ ఘటన జరిగింది. నార్త్ఈస్ట్ ఇంగ్లండ్‌లోని కాస్టల్‌ ఈడెన్ ఏరియాలో ఉన్న ఇంట్లోకి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వచ్చి దోపిడీకి పాల్పడ్డారని చెప్పాడు బెన్‌ స్టోక్స్‌. తన భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. వారికి ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించాడు. దయచేసి ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో.. వారికిదే నా విన్నపం అంటూ Xలో పోస్ట్‌ పెట్టాడు. ఆ వస్తువులను తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అన్నాడు.

అదృష్టవశాత్తూ తన భార్యాపిల్లలకు ఎలాంటి హానీ జరగలేదని.. శారీరకంగా ఇబ్బందిలేకపోయినా.. మానసికంగా మాత్రం వారిని కలవరపరిచిందన్నాడు స్టోక్స్‌. దానినిబట్టే అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నాడు. చోరీకి గురైన కొన్ని వస్తువుల ఫొటోలను బెన్‌స్టోక్స్ షేర్ చేశాడు. అందులో నగలు ఉన్నాయి. డిజైనర్‌ బ్యాగ్, క్రికెట్‌కు అందించిన సేవలకు గౌరవార్థంగా ప్రభుత్వం ఇచ్చిన మెడల్‌ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

బెన్ స్టోక్స్ ట్వీట్..

చివరకు అవి కూడా వదల్లేదుగా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగల బీభత్సం..చివరకు వాటిని కూడా వదలకుండా..
బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగల బీభత్సం..చివరకు వాటిని కూడా వదలకుండా..
అప్పులతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే సరి..
అప్పులతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే సరి..
పోలీసులను చూసి ట్యాంకర్‌ డ్రైవర్‌కు ముచ్చెమటలు.. చివరకు..
పోలీసులను చూసి ట్యాంకర్‌ డ్రైవర్‌కు ముచ్చెమటలు.. చివరకు..
దుల్కర్ సల్మాన్ లవ్ స్టోరీ మాములుగా లేదుగా..
దుల్కర్ సల్మాన్ లవ్ స్టోరీ మాములుగా లేదుగా..
పిన్‌కోడ్‌ను ఎప్పుడు ప్రారంభించారు.? ఈ నెంబర్‌ అర్థం ఏంటంటే
పిన్‌కోడ్‌ను ఎప్పుడు ప్రారంభించారు.? ఈ నెంబర్‌ అర్థం ఏంటంటే
కెప్టెన్‌తో పాటు 24 కోట్ల ప్లేయర్‌ను వదిలించుకున్న కేకేఆర్
కెప్టెన్‌తో పాటు 24 కోట్ల ప్లేయర్‌ను వదిలించుకున్న కేకేఆర్
ఊరి బయట పొలాల్లో యువకుడి మృతదేహాం.. ఆరా తీస్తే..!
ఊరి బయట పొలాల్లో యువకుడి మృతదేహాం.. ఆరా తీస్తే..!
పంత్ ఔట్.. అయ్యర్ హోం కమింగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ ధనాధన్..
పంత్ ఔట్.. అయ్యర్ హోం కమింగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ ధనాధన్..
దీపావళి రోజున పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్‌..
దీపావళి రోజున పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్‌..
ధోనికి రూ. 4 కోట్లు.. సీ‌ఎస్‌కే రిటైన్ ఆటగాళ్ల లిస్టు ఇదే..
ధోనికి రూ. 4 కోట్లు.. సీ‌ఎస్‌కే రిటైన్ ఆటగాళ్ల లిస్టు ఇదే..
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..