ఐపీఎల్ 2025 మధ్యలో షాకింగ్ న్యూస్.. మరణించిన 34 ఏళ్ల ప్లేయర్..

England Cricketer Josh Lawrence Passes Away: ఐపీఎల్ 2025 మధ్య క్రికెట్ ప్రపంచానికి సంబంధించిన ఒక విచారకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఒక ఇంగ్లాండ్ ఆటగాడు అకస్మాత్తుగా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. ఈ 34 ఏళ్ల ఆటగాడు సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ నుండి తన కెరీర్‌ను ప్రారంభించాడు.

ఐపీఎల్ 2025 మధ్యలో షాకింగ్ న్యూస్.. మరణించిన 34 ఏళ్ల ప్లేయర్..
Josh Lawrence Passes Away

Updated on: Apr 30, 2025 | 6:50 AM

England Cricketer Josh Lawrence Passes Away: ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారతదేశంలో జరుగుతోంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి దృష్టి ఈ లీగ్ పైనే ఉంది. ఇంతలో, క్రికెట్ ప్రపంచానికి ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ అకస్మాత్తుగా మరణించడంతో అంతా షాక్‌కి గురయ్యారు. ఈ ఆటగాడు కేవలం 34 సంవత్సరాల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసి అభిమానులలో ఈ విషాద వార్తను తెలియజేసింది. సర్రే ఇంగ్లాండ్‌లోని ఒక ప్రసిద్ధ క్రికెట్ క్లబ్ అని తెలిసిందే.

అకస్మాత్తుగా మరణించిన 34 ఏళ్ల ఆటగాడు..

34 ఏళ్ల క్రికెటర్ జోష్ లారెన్స్ మరణించాడని సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అతను జోష్ లారెన్స్ సర్రే అకాడమీ తరపున ఆడుతున్నట్లు పేర్కొంది. అతను తన క్రికెట్ కెరీర్‌ను ఈ క్లబ్ నుంచే ప్రారంభించాడు. జోష్ లారెన్స్ చాలా సంవత్సరాలు సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు. అతను అండర్-13 నుంచి ఈ క్లబ్‌లో భాగంగా ఉన్నాడు. తరువాత అతను డోర్సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున కూడా ఆడాడు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసింది. ‘సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌లోని ప్రతి ఒక్కరూ జోష్ లారెన్స్ మరణ వార్త విని చాలా బాధపడ్డారు. జోష్ సర్రే ఏజ్ గ్రూప్ పాత్ వేలో ఆడాడు. సెకండ్ ఎలెవన్‌కు ప్రాతినిధ్యం వహించాడు’ అని తెలిపింది. క్లబ్ కెప్టెన్ రోరీ బర్న్స్ మాట్లాడుతూ.. ‘క్లబ్ తరపున నేను జోష్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను జోష్ చిన్నతనంలో అతనితో ఆడాను. అతనో గొప్ప క్రికెటర్, అతనితో మైదానాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

2014లో చివరి మ్యాచ్ ఆడిన జోష్ లారెన్స్..

2014లో యునికార్న్స్ నాకౌట్ ట్రోఫీ సందర్భంగా జోష్ లారెన్స్ డోర్సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో, అతను 56 బంతుల్లో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఈ మ్యాచ్‌లో అతని జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..