AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: జైలుకి వెళ్లొచ్చాక.. కోట్ల వర్షం కురిసింది.. కట్‌చేస్తే.. ఆడకుండానే 2 సార్లు ‘ఛాంపియన్’గా మారాడు..

Ben Stokes Birthday: ఆయన పేరు వింటేనే బౌలర్లకు దడ పుడుతుంది. ఫ్యాన్స్ కూడా మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గెలుస్తామనే ధీమాతో ఉంటారు. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయినా ఈ ఇంగ్లిష్ ఆల్ రౌండర్ విజయం అందిస్తాడని నమ్ముతుంటారు.

IPL 2023: జైలుకి వెళ్లొచ్చాక.. కోట్ల వర్షం కురిసింది.. కట్‌చేస్తే.. ఆడకుండానే 2 సార్లు 'ఛాంపియన్'గా మారాడు..
Ben Stokes Birthday
Venkata Chari
|

Updated on: Jun 04, 2023 | 2:53 PM

Share

Happy Birthday Ben Stokes: బెన్ స్టోక్స్.. ఆ పేరు వింటేనే బౌలర్లకు దడ పుడుతుంది. ఫ్యాన్స్ కూడా మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గెలుస్తామనే ధీమాతో ఉంటారు. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయినా ఈ ఇంగ్లిష్ ఆల్ రౌండర్ విజయం అందిస్తాడని నమ్ముతుంటారు. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ 2019 ఫైనల్ కావచ్చు లేదా పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2022 ఫైనల్ కావచ్చు లేదా 2019 యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టు కావొచ్చు. స్టోక్స్ ఒంటిచేత్తో ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా మార్చాడు.

బెన్ స్టోక్స్ 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో అజేయంగా 84 పరుగులతో నిలిచాడు. ఆ తర్వాత అతను సూపర్ ఓవర్‌లో కూడా బ్యాటింగ్ చేశాడు. అది టైగా ముగిసింది. బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ తొలి టైటిల్‌ను గెలుచుకుంది. దీని తర్వాత, మూడో యాషెస్ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యానికి సమాధానంగా 286 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అతను జాక్ లీచ్‌తో కలిసి చివరి వరకు క్రీజులో ఉండి ఇంగ్లాండ్‌కు 1 వికెట్ విజయాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

పోరాటానికి మారుపేరు..

గతేడాది కూడా టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో 52 పరుగులతో ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. మ్యాచ్‌ను గెలిపించిన ఈ ఆటగాడికి నేటితో 32 ఏళ్లు. జూన్ 4, 1991న జన్మించిన స్టోక్స్ విలువ గత కొన్నేళ్లుగా బారీగా పెరిగింది. జైలుకు వెళ్లినా ఆయన డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. 2017లో నైట్‌క్లబ్ దగ్గర ఇద్దరు వ్యక్తులతో గొడవపడినందుకు అరెస్టయ్యాడు. జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

వివాదం తర్వాత ఫుల్ డిమాండ్..

View this post on Instagram

A post shared by Ben Stokes (@stokesy)

ఇదిలావుండగా, అతనికి ఐపీఎల్‌లో డిమాండ్ ఏర్పడింది. అతను 2018 సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ.12.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత IPL 2023లో చెన్నై అతన్ని రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, అతను చెన్నై కోసం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. లీగ్ దశ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత, చెన్నై టైటిల్ గెలుచుకుంది.

పుట్టినరోజు ముందు అద్భుతం..

ఇది మాత్రమే కాదు.. పుట్టినరోజుకు ఒక రోజు ముందు, స్టోక్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ లేకుండా మ్యాచ్ గెలిచిన మొదటి కెప్టెన్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌పై ఈ ఘనత సాధించాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే