ENG vs PAK: భారీ సిక్స్‌ చూశారా? ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచులో బాదేసిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్..!

|

Jul 19, 2021 | 11:44 AM

క్రికెట్ చరిత్రలో అతి భారీ సిక్స్‌ను చూశారా? ఇంగ్లాండ్ లోని హెడింగ్లే స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ ఈ భారీ సిక్స్ బాదేశాడు.

ENG vs PAK: భారీ సిక్స్‌ చూశారా? ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచులో బాదేసిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్..!
Eng Vs Pak Biggest Six
Follow us on

Biggest six: ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ నడుస్తోంది. ఈ సందర్భంగా జులై 16న జరిగిన తొలి టీ 20లో ఇంగ్లండ్ ఓపెనర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని బాదేశాడు. కానీ, ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించడంతో ఈ ఇంగ్లండ్ ఓపెనర్ సెంచరీ మరుగున పడి పోయింది. ఇక ఆదివారం జులై 18న మూడు మ్యాచులు జరిగాయి. భారత్- శ్రీలంక, జింబాబ్వే-బంగ్లాదేశ్, ఇంగ్లండ్- పాకిస్తాన్ టీంల మధ్య ఆసక్తికర మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. అయితే, ఇంగ్లండ్, పాకిస్తాన్ మద్య జరిగిన రెండవ టీ20లో ఇంగ్లండ్ ఓపెనర్ లియామ్ లివింగ్‌స్టోన్ భారీ సిక్స్ బాది మరోసారి ఆకట్టుకున్నాడు.

ఈ మ్యాచులో లివింగ్‌స్టోన్ 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు. 165.22 సగటుతో 2 ఫోర్లు, 3 సిక్సులు బాదేశాడు. హారిస్ రౌఫ్ వేసిన 16వ ఓవర్‌లో తొలి బంతిని లాంగ్ ఆన్‌ మీదుగా స్టేడియం పై కప్పును దాటించాడు. క్రికెట్ చరిత్రలో ఇదే అతి భారీ సిక్స్ అని మాట్లాడుకుంటున్నారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ కూడా తమ ట్విట్టర్‌లో ఈ సిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘అతి భారీ సిక్స్ ఇదేనా?’ అంటూ చెప్పుకొచ్చింది. పాకిస్తాన్ బౌలర్ హసిఫ్ రవూఫ్ బౌలింగ్‌లో స్ట్రైట్‌గా కొట్టిన లివింగ్‌స్టోన్.. హెడింగ్లేలోని త్రీటైర్ స్టాండ్‌ను దాటేసి పక్కనే ఉన్న రగ్బీ స్టేడియంలోకి వెళ్లింది. దాదాపు ఈ సిక్స్ 122 మీటర్లు దాటింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 200 పరుగులు చేయగలిగింది. జాస్ బట్లర్ (59), మొయిన్ అలీ (36), లియామ్ లివింగ్‌స్టోన్ (38) రాణించారు. 19.5 ఓవర్లకు ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్ 201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. నిర్ణీత ఓవర్లలో కేవలం 155 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. షకీబ్ మహ్మద్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ బౌలింగ్‌తో పాకిస్తాన్ టీంను కోలుకోనివ్వకుండా చేశారు. ఈ విజయంలో టీ20 సిరీస్‌ 1-1తో సమం అయింది.

Also Read:

IND vs SL: అరంగేట్ర మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు.. కృనాల్ పాండ్య తర్వాత..!

Tokyo Paralympics 2020: అథ్లెట్‌గా మారిన కలెక్టర్.. సరికొత్త రికార్డుతో పారా ఒలింపిక్స్‌కు పయనం!