IND VS ENG: శ్రుతిమించుతోన్న ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగడాలు.. భారతీయ అభిమానులపై జాత్యాహంకార వ్యాఖ్యలు..
India vs England: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదోవ టెస్టు నాలుగవ రోజున భారతీయ క్రికెట్ అభిమానులపై జాత్యాహంకార ( Racism) వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫ్యాన్స్‌ను లక్ష్యంగా చేసుకుని
India vs England: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదోవ టెస్టు నాలుగవ రోజున భారతీయ క్రికెట్ అభిమానులపై జాత్యాహంకార ( Racism) వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫ్యాన్స్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ఇంగ్లిష్ క్రికెట్ అభిమానులు ఈ దురహంకార వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) స్పందించింది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జాత్యాహంకార వ్యాఖ్యలు చోటుచేసుకున్న ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తామని కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
Racist behaviour at @Edgbaston towards Indian fans in block 22 Eric Hollies. People calling us Curry C**ts and paki bas****s. We reported it to the stewards and showed them the culprits at least 10 times but no response and all we were told is to sit in our seats. @ECB_cricketpic.twitter.com/GJPFqbjIbz
క్రికెట్‌లో రేసిజంకు ఆస్కారం లేదని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన ఘటనపై నిశీతంగా పరిశీలిస్తామని ఈసీబీ తెలిపింది. కాగా ఇటీవల ఇంగ్లండ్ క్రికెట్‌లో రేసిజం ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం యార్క్‌షైర్ మాజీ స్పిన్నర్ అజీమ్ రఫీక్ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ క్రికెట్‌లో రేసిజం శ్రుతిమించుతోందని, ఈ అంశంపై కఠినంగా వ్యవహరించాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 119 రన్స్ అవసరం. జోరూట్ (76), బెయిర్‌స్టో (72) క్రీజులో ఉన్నారు. మరోవైపు భారత జట్టు విజయం సాధించాలంటే ఏడు వికెట్లు నేలకూల్చాల్సి ఉంది.
So much for battling racism in cricket!! @Edgbaston was horrific today. So many complaints made to stewards however said person was not removed. So disappointed in what we had to face most of the day. @ICC@ECB_cricket@BCCI