Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ దూకుడుకు బ్రేకులు వేసిన తెలంగాణ DGP కొడుకు

Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 44 పరుగులతో రాణించాడు. సిరాజ్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన వైభవ్, చామా మిలింద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చూపించిన ధైర్యం, బ్యాటింగ్ వేగం ఫైనల్ మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ దూకుడుకు బ్రేకులు వేసిన తెలంగాణ DGP కొడుకు
Vaibhav Sooryavanshi

Updated on: Sep 06, 2026 | 1:35 PM

Vaibhav Sooryavanshi: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ సంచలన ఆరంభాన్ని సాధించింది. 15 ఏళ్ల యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో సిరాజ్ వంటి స్టార్ బౌలర్లపై విరుచుకుపడుతూ 37 బంతుల్లోనే 44 పరుగులు చేసి రచ్చ లేపాడు. దక్షిణ భారత్‌కు చెందిన సౌత్ జోన్, తూర్పు భారత్‌కు చెందిన ఈస్ట్ జోన్ మధ్య ప్రారంభమైన ఈ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణయానికి తగినట్లే ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచి సౌత్ జోన్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఆరంభం నుంచే బాదుడే లక్ష్యంగా ఆడుతూ మొదటి వికెట్‌కు ఏకంగా 100 ప్లస్ భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టుకు స్ట్రాంగ్ పునాది వేశారు.

సిరాజ్ బౌలింగ్‌ను టార్గెట్ చేసిన 15 ఏళ్ల వైభవ్

ఈ ఇన్నింగ్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి. భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన ఒకే ఓవర్‌లో ఏకంగా 14 పరుగులు పిండుకున్న వైభవ్, అందులో ఒక భారీ సిక్సర్, రెండు ఫోర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 44 పరుగులు చేసిన వైభవ్ టీ20 మోడ్‌లో పరుగులు సాధించాడు. అయితే దురదృష్టవశాత్తు అర్ధశతకానికి ఆరు పరుగుల దూరంలో నిలిచిపెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.

వికెట్ తీసిన మిళింద్

ఎంతో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని హైదరాబాద్ పేసర్ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు మిళింద్ విడదీశాడు. మిళింద్ వేసిన 15వ ఓవర్లో ఒక అద్భుతమైన బంతికి వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్యాచ్‌ను మైదానంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చిన తనయ్ త్యాగరాజన్ మైండ్ బ్లాకింగ్ రీతిలో అందుకోవడంతో వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

కష్టాల్లో పడ్డ సౌత్ జోన్ బౌలర్లు

మరోవైపు స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన మొదటి స్పెల్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 5 ఓవర్లలో ఏకంగా 8.20 ఎకానమీతో 41 పరుగులు సమర్పించుకున్నాడు. స్పిన్నర్ త్రిపురాణ విజయ్ కూడా మొదటి 3 ఓవర్లలోనే 27 పరుగులు ఇచ్చాడు. వైభవ్ అవుట్ అయినా మరొక ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, ఈస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us