AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెంచరీకి చేరువలో సిరాజ్ మియా..! బుడ్డోడి దెబ్బకు మైండ్ దొబ్బినట్టు ఉందిగా..

దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. ఇషాన్ కిషన్ అజేయ సెంచరీతో 111 పరుగులు చేయగా, ఈస్ట్ జోన్ 4 వికెట్లకు 385 పరుగులు చేసింది. మరోవైపు సౌత్ జోన్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ 14 ఓవర్లలో 96 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

సెంచరీకి చేరువలో సిరాజ్ మియా..! బుడ్డోడి దెబ్బకు మైండ్ దొబ్బినట్టు ఉందిగా..
Siraj In Duleep Trophy
SN Pasha
|

Updated on: Sep 07, 2026 | 7:10 AM

Share

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. దేశవాళీ క్రికెట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీ విజేతగా నిలిచేందుకు ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు పోటీ పడుతున్నాయి. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. ప్రస్తుతానికి అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు 79 ఓవర్ల ఆట జరగ్గా.. ఈస్ట్ జోన్ 4 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా వెళ్తోంది. ఆ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ సెంచరీతో కదంతొక్కి మరింత పెద్ద స్కోరు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం 111 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అతనితో పాటు కుమార్ కుషాగ్రా 63 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఓపెనర్ ఈశ్వర్ అభిమన్యు 72, వైభవ్ సూర్యవంశీ 44, శిఖర్ మోహన్ 85 పరుగులతో రాణించారు. సుదీప్ కుమార్ 6 పరుగులు చేసి విఫలమయ్యాడు.

ఈస్ట్ జోన్ పరిస్థితి ఇలా ఉంటే.. మన సౌత్ జోన్ పరిస్థితి భిన్నంగా ఉంది. బౌలర్లు చాలావరకు తేలిపోయారు. ముఖ్యంగా మన హైదరాబాదీ కుర్రాడు, డీఎస్పీ సాబ్ మొహమ్మద్ సిరాజ్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా స్క్వాడ్‌లోకి వచ్చిన సిరాజ్ మియా తొలి రోజు 14 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని తెలిసినా.. వరల్డ్ క్లాస్ బౌలర్ ఇలా దేశవాళీ క్రికెట్‌లో వికెట్ లేకుండా ఒక రోజంతా ఉండటం మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా టెస్టు క్రికెట్ స్పెషలిస్ట్ బౌలర్‌గా పేరున్న సిరాజ్.. ఈ మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడనే చెప్పాలి.

సెంచరీకి అతి చేరువలో..

14 ఓవర్లలో 6.90 ఎకానమీతో ఏకంగా 96 పరుగులు సమర్పించుకున్నాడు. సెంచరీ పూర్తి చేసుకోవడానికి ఇంకా కేవలం 4 పరుగుల దూరంలోనే ఉన్నాడు. రెండో రోజు ఆటలో అది కూడా పూర్తి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ ఆరంభంలో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సిరాజ్‌కు షాక్ ఇచ్చాడు. అతను వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 4, 6, 4 బాది భారీగా పరుగులు రాబట్టాడు. అక్కడి నుంచి సిరాజ్ సరైన లయలో కనిపించలేదు. వైభవ్ దెబ్బకు సిరాజ్ మైండ్ బ్లాంక్ అయినట్లు ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే మ్యాచ్ మధ్యలో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను మాత్రం సిరాజ్ ఇబ్బంది పెట్టాడు. ఓ షార్ప్ బౌన్సర్‌తో ఇషాన్ మతిపోగొట్టాడు. ఆ సమయంలో సిరాజ్, ఇషాన్ మధ్య సరదా సంభాషణ కూడా నడిచింది. మరి ఆట రెండో రోజు అయినా సిరాజ్ తన సత్తా చూపిస్తాడో లేదో చూడాలి.

Follow Us