AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. 2029లోగా వరుసగా మరో మూడు DSC నోటిఫికేషన్‌లు

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. 2029లోగా మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడే అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి..

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. 2029లోగా వరుసగా మరో మూడు DSC నోటిఫికేషన్‌లు
AP to Issue Three More DSC Notifications
Srilakshmi C
|

Updated on: Sep 07, 2026 | 6:55 AM

Share

అమరావతి, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. 2029లోగా రాష్ట్రంలో మరో మూడు డీఎస్సీ (District Selection Committee) నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏటా డీఎస్సీ నిర్వహించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ పాల్గొని మాట్లాడారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ‘కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. 14 డీఎస్సీలు వేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు. మా ప్రభుత్వాల హయాంలో రెండు లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది ఉపయోగకరమైన నిర్ణయమని తెలిపారు. 2029లోగా మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు అవసరమైన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. మంత్రి ప్రకటనతో రాబోయే డీఎస్సీలపై నిరుద్యోగులు, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ఆసక్తి నెలకొంది.

కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల సంఖ్య, పాఠశాలల అవసరాలు, ఉపాధ్యాయుల పదవీ విరమణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖాళీలను గుర్తించే అవకాశం ఉంది. 2029లోగా మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలైతే.. టీచర్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది కీలక అవకాశంగా మారనుంది. ముఖ్యంగా డీఎస్సీ, టెట్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డీఎస్సీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం వల్ల విద్యా రంగంలో ఖాళీలు తగ్గడంతో పాటు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. అయితే నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య, కేటగిరీల వారీగా ఖాళీలు, అర్హతలు, పరీక్ష విధానం, షెడ్యూల్‌ వంటి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించిన తర్వాతే స్పష్టత రానుంది. మూడు డీఎస్సీ నోటిఫికేషన్లపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం అభ్యర్థులకు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు అభ్యర్థులు గత డీఎస్సీ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ సిలబస్‌ ఆధారంగా preparation కొనసాగించడం మంచిది.

Follow Us
నిరుద్యోగులకు అలర్ట్.. 2029లోగా వరుసగా మరో 3 DSC నోటిఫికేషన్‌లు
నిరుద్యోగులకు అలర్ట్.. 2029లోగా వరుసగా మరో 3 DSC నోటిఫికేషన్‌లు
సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..
సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గుతున్న ధరలు
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గుతున్న ధరలు
దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్‌! ఎక్కడంటే..
దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్‌! ఎక్కడంటే..
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు.. డాక్టర్లు ఏం చేశారంటే?
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు.. డాక్టర్లు ఏం చేశారంటే?
ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్
ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..