Nitish Reddy : టీమిండియాను వెంటాడుతున్న గాయాల బెడద.. నితీష్ రెడ్డి ప్లేసులో ఎవరంటే ?

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరు వస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శార్దూల్ ఠాకూర్, అంశుల్ కంబోజ్, ధ్రువ్ జురెల్ పేర్లు రేసులో ఉన్నాయి. జట్టు గాయాలతో సతమతం అవుతుండటంతో గౌతమ్ గంభీర్ నిర్ణయం కీలకం కానుంది.

Nitish Reddy : టీమిండియాను వెంటాడుతున్న గాయాల బెడద.. నితీష్ రెడ్డి ప్లేసులో ఎవరంటే ?
Nitish Reddy

Updated on: Jul 21, 2025 | 11:31 AM

Nitish Reddy : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పుడు నాలుగో మ్యాచ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. బుధవారం నుంచి మాంచెస్టర్‌లో ఈ కీలక మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే టీమిండియా కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి అవకాశం లభిస్తుందనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. నితీష్ రెడ్డి ఇప్పటివరకు రెండు టెస్టు మ్యాచ్‌లలో 45 పరుగులు చేసి మూడు వికెట్లు తీశాడు. అయితే, లార్డ్స్ టెస్టులో అతను కొంత మెరిసినా, నిలకడగా రాణించలేకపోవడం వల్ల అతడిని పక్కన పెట్టే అవకాశం ఉంది. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి మూడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి:

శార్దూల్ ఠాకూర్

శార్దూల్ ఠాకూర్ ఎక్స్ పీరియన్స్ ఉన్న ఆల్ రౌండర్. నితీష్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి అతనే సరైన ఆటగాడిగా భావిస్తున్నారు. అయితే, హెడింగ్లీ టెస్టులో అతను బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. బౌలింగ్‌లో కూడా అతనికి ఎక్కువ ఓవర్లు ఇవ్వలేదు. అయినప్పటికీ, అతని అనుభవం, జట్టుకు ఉపయోగపడే కెపాసిటీ ఉన్నందువల్ల తనే పర్ఫెక్ట్ అంటున్నారు.

అంశుల్ కంబోజ్

హర్యానాకు చెందిన యువ పేసర్ అంశుల్ కంబోజ్ను ఇటీవల టీమ్ కవర్‌గా పిలిపించారు. అతను దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన ఇండియా ‘ఏ’ మ్యాచ్‌లలో ఒక హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. భారత్ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలని భావిస్తే, కంబోజ్‌కు టెస్ట్ అరంగేట్రం చేయించవచ్చు.

ధ్రువ్ జురెల్, అంశుల్ కంబోజ్‌లతో వ్యూహం

మరొక ప్రత్యామ్నాయం ఏమిటంటే, బ్యాటింగ్‌ను బలోపేతం చేయడానికి ధ్రువ్ జురెల్ ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చడం. అలాగే, బౌలింగ్ విభాగంలో ఆకాష్ దీప్ స్థానంలో అంశుల్ కంబోజ్‌కు అవకాశం ఇవ్వడం. ఇలా చేస్తే, భారత బౌలింగ్ అటాక్ ఇలా ఉండవచ్చు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అంశుల్ కంబోజ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్.

గాయాల బెడదతో టీమ్ ఇండియాకు ఇబ్బందులు
టీమ్ ఇండియా ఇప్పటికే చాలా మంది ఆటగాళ్ల గాయాలతో ఇబ్బంది పడుతోంది. రిషబ్ పంత్, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా సెలక్షన్ కు అందుబాటులో లేరు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ శుభమన్ గిల్, టీమ్ మేనేజ్‌మెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ ఏ దిశగా వెళ్తారో చూడాలి. శార్దూల్ కు అవకాశం ఇస్తారా, లేక అశుంల్ కంబోజ్‌కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి