AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahid Afridi : ‘ముందే రాకుండా ఉండాల్సింది.. ఇలా చేయడం బాలేదు’.. టీమిండియా ప్లేయర్లపై అఫ్రిది కీలక వ్యాఖ్యలు

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు కావడంతో షకీద్ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్ల నిర్ణయాన్ని విమర్శిస్తూ, క్రికెట్‌లో రాజకీయాలు వద్దని అతను పిలుపునిచ్చాడు. పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

Shahid Afridi : ‘ముందే రాకుండా ఉండాల్సింది.. ఇలా చేయడం బాలేదు’.. టీమిండియా ప్లేయర్లపై అఫ్రిది కీలక వ్యాఖ్యలు
Shahid Afridi
Rakesh
|

Updated on: Jul 21, 2025 | 10:55 AM

Share

Shahid Afridi : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‎లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. దీనిపై పాకిస్థాన్ ఛాంపియన్స్ కెప్టెన్ షకీద్ అఫ్రిది చాలా సీరియస్‌గా మాట్లాడాడు. ఈ మ్యాచ్ జూలై 20న బర్మింగ్‌హామ్‌లో జరగాలి. కానీ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడటానికి ఒప్పుకోలేదు. దాంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేసి క్షమాపణలు చెప్పారు. శిఖర్ ధావన్ తన లేఖ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో పాకిస్థాన్‌తో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‎లో ఎలాంటి మ్యాచ్ ఆడబోనని చెప్పాడు. హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కూడా మ్యాచ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై షకీద్ అఫ్రిది స్పందించాడు. “ఆడటం ఇష్టం లేకపోతే మ్యాచ్ కోసం రావడమే ఎందుకు?” అని అన్నాడు.

మ్యాచ్ నుంచి భారత ఆటగాళ్లు తప్పుకోవడంపై అఫ్రిది విమర్శలు చేశాడు. ఇండియా ఛాంపియన్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారని గుర్తు చేశాడు. “మేము క్రికెట్ ఆడటానికి ఇక్కడికి వచ్చాం. పాకిస్థాన్‌తో ఆడటం ఇష్టం లేకపోతే, మొదట రావద్దని చెప్పి ఉండాలి. ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత వద్దు అనడం ఏంటి? ఒక్క రోజులో అన్నీ మారిపోయాయి. ఆటలు మనుషులను దగ్గర చేస్తాయి. కానీ రాజకీయాలు ప్రతిదానిలో కలిస్తే, మనం ఎలా ముందుకు వెళ్తాం? కూర్చుని మాట్లాడనంత కాలం, ఏమీ మారదు” అని అఫ్రిది చెప్పాడు.

కొన్ని మీడియా వార్తల ప్రకారం.. పహల్గామ్ దాడి తర్వాత షకీద్ అఫ్రిది భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు. అందుకే భారత ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేసి మ్యాచ్ నుంచి తప్పుకున్నారని అంటున్నారు. దీనిపై అఫ్రిది స్పందిస్తూ.. “క్రికెట్ ముందు నేను ఏమీ కాదు” అని అన్నాడు. “నా వల్ల మ్యాచ్ రద్దు అవుతుందని నాకు తెలిసి ఉంటే, నేను గ్రౌండ్‌కు కూడా వచ్చేవాడిని కాదు. కానీ క్రికెట్ ఆగకూడదు. షకీద్ అఫ్రిది కంటే క్రికెట్ చాలా గొప్పది. ఆట ముందు వస్తుంది. రాజకీయాలను మధ్యలోకి తేవడం లేదా భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడమని చెబితే, ఆడకండి, ఇంట్లో కూర్చోండి. కానీ క్రికెట్ పెద్దది” అని అఫ్రిది గట్టిగా చెప్పాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్