MS Dhoni: మిస్టర్ కూల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో టీ20 లీగ్‌లో ఆడనున్న ఎంఎస్ ధోని!
Chennai Super Kings: ఐపీఎల్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందరో యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకువచ్చే ఈ క్రికెట్ లీగ్ కాసుల వర్షం కురిపిస్తుంది. అందుకే అంతర్జాతీయ
Chennai Super Kings: ఐపీఎల్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందరో యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకువచ్చే ఈ క్రికెట్ లీగ్ కాసుల వర్షం కురిపిస్తుంది. అందుకే అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఈ లీగ్‌లోఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఐపీఎల్‌ను చూసి విదేశాల్లో ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, యూఏఈ క్రికెట్ లీగ్, బిగ్ బాష్.. ఇలా ఎన్నో లీగ్‌లు పురుడుపోసుకున్నాయి. అయితే ఇవేవీ ఐపీఎల్ టోర్నీలా పాపులారిటీ తెచ్చుకోలేకపోయాయి. ఇప్పుడు మరో క్రికెట్ లీగ్ వస్తోంది. క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ను ప్రారంభిస్తోంది. ఈ లీగ్ మొదటి ఎడిషన్ జనవరి 2023లో జరిగే అవకాశం ఉంది.
సీఎస్కే సారథిగా..
కాగా ఈ క్రికెట్ లీగ్‌లో మొత్తం ఆరుజట్లు పాల్గొననున్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను కూడా భారత్‌కు చెందిన వారే కొనుగోలు చేయడం గమనార్హం. కేప్‌టౌన్, జోహన్నెస్‌బర్గ్, పోర్ట్ ఎలిజబెత్, ప్రిటోరియా, డర్బన్, పార్ల్ పేర్లతో ఆరు జట్లను ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. కేప్‌టౌన్‌ను-ముంబై ఇండియన్స్, జోహన్నెస్‌బర్గ్- చెన్నై సూపర్ కింగ్స్, డర్బన్- లక్నో సూపర్ జెయింట్స్, పోర్ట్ ఎలిజిబెత్- సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రిటోరియా-ఢిల్లీ క్యాపిటల్స్, పార్ల్- రాజస్తాన్ రాయల్స్ దక్కించకున్నాయి. ఇదిలా ఉంటే జోహన్నెస్‌బర్గ్‌ను దక్కించుకున్న సీఎస్‌కే నుంచి తాజాగా ఇంకో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీ ఈ లీగ్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి.
With roaring whistles, everywhere we go, we stride into Johannesburg! ?#WhistlePodu ??
— Chennai Super Kings (@ChennaiIPL) July 20, 2022
కాగా ధోనీ ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్‌కేతోనే ఉంటున్నాడు. అటు ఆటగాడిగా, కెప్టెన్‌గా చెన్నైకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై 2010, 2011, 2018, 2021 టైటిల్స్ గెలుచుకుంది. 2008, 2012, 2013, 2019 లీగ్‌లలో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు 2010, 2014 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను కూడా కైవసం చేసుకుంది. ఈక్రమంలో క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా ధోని మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..