DC vs CSK, IPL 2024: ధోని ధనాధన్ ఇన్నింగ్స్ వృథా.. వైజాగ్‌లో చెన్నైకి జలక్ ఇచ్చిన ఢిల్లీ

ఐపీఎల్ 2024 లో రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఆ జట్టు ఆదివారం (మార్చి 31) రాత్రి పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టికరిపించింది. విశాఖపట్నంలోని డా.వైఎస్. రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై పై 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.

DC vs CSK, IPL 2024: ధోని ధనాధన్ ఇన్నింగ్స్ వృథా.. వైజాగ్‌లో చెన్నైకి జలక్ ఇచ్చిన ఢిల్లీ
DC vs CSK IPL Match

Updated on: Mar 31, 2024 | 11:46 PM

ఐపీఎల్ 2024 లో రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఆ జట్టు ఆదివారం (మార్చి 31) రాత్రి పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టికరిపించింది. విశాఖపట్నంలోని డా.వైఎస్. రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై పై 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52), కెప్టెన్ రిషభ్ పంత్ ( 51) అర్ధ సెంచరీలతో రాణించారు. లక్ష్య ఛేదనలో చెన్నై చేతులెత్తేసింది. బ్యాటర్ల వైఫల్యంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 171 పరుగులే చేసింది. మాజీ కెప్టెన్ ధోని ( 16 బంతుల్లో 37, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ బ్యాటింగ్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అజింక్యా రహనే టాప్ స్కోరర్ గా నిలిచాడు.

డేరిల్ మిషెల్ (34), శివమ్ దూబే (18), రవీంద్ర జడేజా (21 నాటౌట్), సమీర్ రిజ్వి (0), రచిన్ రవీంద్ర ( 2), రుతురాజ్ గైక్వాడ్ (1) పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. దీంతో చెన్నై జట్టుకు పరాజయం తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్‌ కుమార్‌ 3, ఖలీల్‌ అహ్మద్‌ 2, అక్షర్‌ ఒక వికెట్‌ తీశారు.

ఇవి కూడా చదవండి

 

ధోని ధనాధన్ ఇన్నింగ్స్.. వీడియో ఇదుగో..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, ఎన్రిక్ నార్ట్జే, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్):

రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా, ముస్తాఫిజుర్ రహ్మాన్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..