
Delhi Capitals vs Gujarat Titans, 14th Match, Indian Premier League 2026: ఐపీఎల్ 2026లో భాగంగా 14వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్, 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో 70 పరుగులు, జోస్ బట్లర్ 27 బంతుల్లో 52 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 55 పరుగులు సాధించారు. ఢిల్లీ తరపున ముఖేష్ కుమార్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), విపరాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, ముఖేష్ కుమార్, టి నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్లు: సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, నబీ, నమీరా, నాయర్.
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్.
ఇంపాక్ట్ ప్లేయర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, మానవ్ సుతార్, జయంత్ యాదవ్, అనుజ్ రావత్.