IPL 2023: ఢిల్లీ ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్.. దూరమైన స్టార్ ప్లేయర్.. ఎందుకంటే?

|

Apr 07, 2023 | 8:53 PM

Delhi Capitals: ఐపీఎల్ 16వ సీజన్‌లో దాదాపు అన్ని జట్లు ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో కొన్ని గెలిచాయి. కొన్ని టీంలు ఇప్పటి వరకు మొదటి విజయాన్ని నమోదు చేయడంలో ఇబ్బందులు పడుతున్నాయి.

IPL 2023: ఢిల్లీ ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్.. దూరమైన స్టార్ ప్లేయర్.. ఎందుకంటే?
Delhi Capitals
Follow us on

Mitchell Marsh Delhi Capitals IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో దాదాపు అన్ని జట్లు ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో కొన్ని గెలిచాయి. కొన్ని టీంలు ఇప్పటి వరకు మొదటి విజయాన్ని నమోదు చేయడంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా 2 మ్యాచ్‌లు ఆడి విజయాల ఖాతా తెరవలేకపోయింది. ఈ క్రమంలో ఢిల్లీ టీంకు భారీ దెబ్బ తగిలింది. డీసీ కీలకమైన ఆటగాడు, మిచెల్ మార్ష్ కూడా తదుపరి కొన్ని మ్యాచ్‌లకు ఎంపిక కోసం అందుబాటులో ఉండడు.

మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల వల్ల వారం పాటు స్వేదేశానికి తిరిగి వెళ్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో అతను తదుపరి 3 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అతని ప్రత్యామ్నాయంగా రోవ్‌మన్ పావెల్ ఎంపిక ఉంది. అతను బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో జట్టుకు ప్రత్యామ్నాయ పాత్ర పోషించగలడు.

ఈ సీజన్‌లో ఇప్పుడు లెవల్ 2 మ్యాచ్‌లు ఆడుతున్న మిచెల్ మార్ష్ ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మార్ష్ ఖాతా కూడా తెరవలేకపోగా, గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇవి కూడా చదవండి

నిరాశజనకంగా ఢిల్లీ జట్టు ప్రదర్శన..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు చాలా నిరాశాజనక ప్రదర్శనను చవిచూసింది. దీనిలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు జట్టు తన తదుపరి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 8న గౌహతి మైదానంలో ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇందులో జట్టు నెట్ రన్‌రేట్ -1.703గా నిలిచింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..