AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs PBKS : అక్షర్ పటేల్ మైండ్ గేమ్.. పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేయడానికి కెప్టెన్ వాడిన బ్రహ్మాస్త్రం ఇదే!

DC vs PBKS : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ సాధించిన విజయంపై కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌తో పాటు తాను బౌలింగ్ చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. యువ ఆటగాళ్లు ఒత్తిడిలో ఆడుతున్న తీరుపై అక్షర్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు.

DC vs PBKS : అక్షర్ పటేల్ మైండ్ గేమ్.. పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేయడానికి కెప్టెన్ వాడిన బ్రహ్మాస్త్రం ఇదే!
Axer Patel
Rakesh
|

Updated on: May 12, 2026 | 6:25 AM

Share

DC vs PBKS : ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మాట్లాడుతూ.. జట్టు విజయం వెనుక ఉన్న అసలు కారణాలను, తన వ్యూహాలను షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏది? తను ఎందుకు బౌలింగ్ చేయలేదు? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏది?

మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన క్షణం గురించి అక్షర్ మాట్లాడుతూ.. బౌలింగ్‌లో తొలి 3-4 ఓవర్లలో తాము 60 పరుగులు ఇచ్చేసినా, మిడిల్ ఓవర్లలో ముఖేష్ కుమార్, మాధవ్ తివారీ అద్భుతంగా బౌలింగ్ చేశారని గుర్తు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆ స్పెల్ గుర్తు చేసిందని, అక్కడే మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పాడు. ఇక బ్యాటింగ్‌లో తనకి, డేవిడ్ మిల్లర్‌కు మధ్య కుదిరిన భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెడితే, చివర్లో ఆశుతోష్ శర్మ, మాధవ్ తివారీ వంటి యంగ్ ప్లేయర్లు ఫినిషింగ్ టచ్ ఇచ్చారని కొనియాడాడు.

ఎందుకు బౌలింగ్ చేయలేదు?

సాధారణంగా జట్టులో మెయిన్ స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్, ఈ మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా వేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై అక్షర్ స్పందిస్తూ.. “ఈ రోజు వికెట్ భిన్నంగా ఉంది. ఆకిబ్ నబీ బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి స్వింగ్ అవ్వడం గమనించాను. పిచ్ నుంచి పేసర్లకు మంచి సహకారం అందుతోంది. అందుకే స్పిన్నర్ల అవసరం లేదనిపించింది. మాధవ్, ఆకిబ్ బంతితో మ్యాజిక్ చేస్తుంటే, నా అవసరం ఏముంటుంది? అందుకే పేసర్లనే కొనసాగించాను” అని వివరించాడు. ఒకవేళ మాధవ్ తివారీ పరుగులు ఇచ్చి ఉంటే, అప్పుడు తాను బౌలింగ్‌కు వచ్చేవాడినని పేర్కొన్నాడు.

యువ ఆటగాళ్లు ఒత్తిడిలో ఆడుతున్న తీరుపై అక్షర్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. “మా టీమ్ బెంచ్ స్ట్రెంత్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు కీలక సమయాల్లో బాధ్యత తీసుకుని ఆడుతుంటే ఒక కెప్టెన్‌గా నాకు చాలా ధైర్యం కలుగుతోంది. బ్యాటింగ్, ఫీల్డింగ్ లేదా మైదానంలో ఎనర్జీ.. ఇలా ప్రతి విషయంలోనూ కుర్రాళ్లు అదరగొడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ భవిష్యత్తు చాలా బాగుందని ఈ మ్యాచ్ నిరూపించింది” అని ధీమా వ్యక్తం చేశాడు.

కలిసొచ్చిన అదృష్టం

తన బ్యాటింగ్ ఫామ్ గురించి చెబుతూ.. తాను ఎప్పుడూ ఒకే రకమైన ప్రాసెస్ ఫాలో అవుతానని, అయితే ఈ రోజు అదృష్టం కూడా తోడైందని అక్షర్ నిజాయితీగా ఒప్పుకున్నాడు. తనకు లభించిన లైఫ్ (డ్రాప్ క్యాచ్) వల్ల పరుగులు సాధించగలిగానని, గత మ్యాచ్‌లలో అవే క్యాచ్‌లుగా మారాయని చెప్పాడు. ఏదేమైనా టీమ్ అంతా కలిసికట్టుగా పోరాడటం వల్లే ఈ విజయం సాధ్యమైందని కెప్టెన్ స్పష్టం చేశాడు.

Follow Us
3kW లేదా 5kW.. మీ ఇంటికి ఏ సోలార్ సిస్టమ్ ఉత్తమమైనది?
3kW లేదా 5kW.. మీ ఇంటికి ఏ సోలార్ సిస్టమ్ ఉత్తమమైనది?
భారత భూభాగాన్ని ఆక్రమించాం.. నేపాల్ ప్రధాని ప్రకటనతో తీవ్ర దుమారం
భారత భూభాగాన్ని ఆక్రమించాం.. నేపాల్ ప్రధాని ప్రకటనతో తీవ్ర దుమారం
త్వరలో అరుదైన దుష్టగ్రహాల కలయిక.. పెద్ద శుభ వార్తలు వినబోతున్నారు
త్వరలో అరుదైన దుష్టగ్రహాల కలయిక.. పెద్ద శుభ వార్తలు వినబోతున్నారు
నిన్నటి మ్యాచ్‌లో ఇవి గమనించారా.. అస్సలు మిస్సవ్వొద్దు ఈ 5 వింతలు
నిన్నటి మ్యాచ్‌లో ఇవి గమనించారా.. అస్సలు మిస్సవ్వొద్దు ఈ 5 వింతలు
విమానాలు అంటార్కిటికా మీదుగా ఎందుకు వెళ్లవు? షాకింగ్ రహస్యాలు!
విమానాలు అంటార్కిటికా మీదుగా ఎందుకు వెళ్లవు? షాకింగ్ రహస్యాలు!
జూన్‌ నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..!
జూన్‌ నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..!
అంతా కోల్పోయామని బాధపడుతున్నారా? చాణక్య నీతి చెప్పిన పరిష్కారం!
అంతా కోల్పోయామని బాధపడుతున్నారా? చాణక్య నీతి చెప్పిన పరిష్కారం!
కొత్త హీరోయిన్ల రాకతో సీనియర్ భామలకు కష్టాలు
కొత్త హీరోయిన్ల రాకతో సీనియర్ భామలకు కష్టాలు
ఆ పాట వల్లనే తెలుగులో మంచి పేరు వచ్చింది..
ఆ పాట వల్లనే తెలుగులో మంచి పేరు వచ్చింది..
మహిళల చేతి గాజుల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 99శాతం మందికి తెలియదు
మహిళల చేతి గాజుల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 99శాతం మందికి తెలియదు