ఆర్‌సీబీ వద్దంది.. ఇంగ్లాండ్ కౌంటీ ముద్దంది.. 192 స్ట్రైక్ రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ టీమ్‌మేట్!

|

Jun 04, 2022 | 5:58 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్దని తీసేసిన ప్లేయర్.. ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో అదరగొట్టాడు.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఆడుకున్నాడు..

ఆర్‌సీబీ వద్దంది.. ఇంగ్లాండ్ కౌంటీ ముద్దంది.. 192 స్ట్రైక్ రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ టీమ్‌మేట్!
Royal Challengers Bangalore
Follow us on

ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 15వ సీజన్ ముగిసింది. డుప్లెసిస్ నాయకత్వంలో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి ప్లేఆఫ్స్‌ వరకు చేరుకొని.. ఎలిమినేటర్‌లో చతికిలబడిన విషయం విదితమే. పేపర్‌పై బెంగళూరు జట్టు స్ట్రాంగ్ అయినప్పటికీ.. ఈసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోవడం.. ఆర్‌సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఇదిలా ఉంటే.. బెంగళూరు జట్టు బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నా.. యాజమాన్యం కొంతమంది ప్లేయర్స్‌కు ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వలేదని చెప్పాలి. అందులో ఒకరు డేవిడ్ విల్లీ. ఐపీఎల్ 2022లో ఆర్‌సీబీ తరపున నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు డేవిడ్ విల్లీ. ఆ తర్వాత అతడికి మరిన్ని అవకాశాలు దక్కలేదు. కానీ ఈ ఆల్‌రౌండర్ ఇప్పుడు ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో బ్యాట్‌తో రచ్చలేపుతున్నాడు.

ఈ టోర్నీలో విల్లీ యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈ జట్టు శుక్రవారం డర్హామ్‌తో తలబడింది. లీడ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హామ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇంతటి భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో యార్క్‌షైర్‌ జట్టుకు డేవిడ్ విల్లీ అండగా నిలిచాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.

192 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్..

కొండంత లక్ష్యాన్ని చేధించే క్రమంలో యార్క్‌షైర్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు ఆడమ్ లిత్, ఫిన్ అలెన్ తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. 29 పరుగుల వద్ద ఫిన్ అలెన్ ఔట్ కాగా.. ఆడమ్ లిత్ 33 బంతుల్లో 77 పరుగులు చేసి బౌలర్లను ఉతికారేశాడు. అతడు తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. 10వ ఓవర్ ఐదో బంతికి ఆడమ్ లిత్ పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్ విల్లీ చిన్న సైజ్ విధ్వంసం సృష్టించాడు. 39 బంతుల్లో అజేయంగా 75 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో, విల్లీ 8 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 192.31గా ఉంది.

ఇవి కూడా చదవండి

డర్హామ్ ఇన్నింగ్స్ ఇలా సాగింది…

డర్హామ్ బ్యాటర్లు అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి.. జట్టు భారీ స్కోర్ సాధించడంలో సహాయపడ్డారు. ఆ జట్టు ఓపెనర్ గ్రాహం క్లార్క్ 37 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 65 పరుగులు చేయగా… కెప్టెన్ ఒలీ రాబిన్సన్ 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 56 పరుగులు పూర్తి చేశాడు. వీరిద్దరూ మినహా జట్టులోని మిగతా బ్యాటర్లు ఎవ్వరూ కూడా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు.

ఐపీఎల్ 2022లో విల్లీ ప్రదర్శన ఇలా సాగింది..

ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహించిన డేవిడ్ విల్లీ 4 మ్యాచ్‌ల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే బౌలింగ్‌లో ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.