Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బాలీవుడ్ బ్యూటీతో డేటింగ్? పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి!

SRH ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పెళ్లి గురించి స్టేడియంలో అభిమానులు సరదాగా ప్రశ్నలు సంధించారు. "మ్యారేజ్ ఎప్పుడు బ్రో?" అంటూ వచ్చిన ప్రశ్నలకు నవ్వుతూ తల ఊపి స్పందించాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, అతను బాలీవుడ్ హీరోయిన్‌ను డేటింగ్ చేస్తున్నాడని ఊహాగానాలు చెలరేగాయి. అయితే, నితీశ్ ప్రస్తుతం తన ఆటపై దృష్టి పెట్టి SRH విజయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. 

Video: బాలీవుడ్ బ్యూటీతో డేటింగ్? పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి!
Nitish Kumar Reddy
Follow us
Narsimha

|

Updated on: Mar 24, 2025 | 4:55 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఐపీఎల్ 2025 ప్రస్థానాన్ని ఘన విజయంతో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుపై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే, మ్యాచ్ మధ్యలోనే అతని పెళ్లి గురించి జరిగిన ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ సమయంలో, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, నితీశ్ కుమార్ రెడ్డి బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో, స్టేడియంలో ఉన్న అభిమానులు సన్‌రైజర్స్ జట్టుకు మద్దతుగా పెద్దగా అరుస్తూ కనిపించారు. అయితే, కొంతమంది నితీశ్‌ను “మ్యారేజ్ ఎప్పుడు బ్రో?” అంటూ గట్టిగా ప్రశ్నించారు.

అంతేకాకుండా, “అమ్మాయిలు సచ్చిపోతున్నారు బ్రో!”, “బ్రో, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా?”.. అంటూ అభిమానులు ఫన్నీ కామెంట్లు చేశారు. నితీశ్ కుమార్ రెడ్డి తన పెళ్లి గురించి తల ఊపుతూ ఏదో సంకేతంగా క్లారిటీ ఇచ్చాడు. లోపల సిగ్గుపడుతూ నవ్వుతూ కనిపించిన అతడు, ఆ ప్రశ్నను హాస్యంగా తీసుకున్నట్టు వీడియోలో కనిపించింది.

ఈ సంఘటనతో పాటు, నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి అంటూ ఊహించుకున్నారు. ఈ వీడియోపై స్పందించిన కొంతమంది క్రికెట్ అభిమానులు, “నితీశ్ కు ఇప్పుడే పెళ్లి ఎందుకు?” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

“బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాడేమో!”, “కొద్ది రోజులు బ్రతకనివ్వండి బ్రో, కెరీర్ మొదలైంది, ఇప్పుడే పెళ్లి ఏంట్రా?”, “పెళ్లి గురించి ఆలోచించడానికి చాలా టైమ్ ఉంది, ముందు మరికొన్ని మ్యాచుల్లో అద్భుతంగా ఆడి SRHను ట్రోఫీ గెలిపించాలి!”.. అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి కీలక భూమిక పోషించాడు. SRH జట్టుకు మంచి ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న నితీశ్, తన బ్యాటింగ్, బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. ఈసారి SRH జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకడిగా అతను నిలిచాడు. అయితే, అభిమానులు అతని పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండటంతో, నితీశ్ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.

నితీశ్ కుమార్ రెడ్డి పెళ్లిపై స్టేడియంలో అభిమానులు ప్రశ్నలు సంధించడంతో, అతని నవ్వులు, తల ఊపుడుతో క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే, ఇది క్రికెట్ అభిమానులకు సరదా విషయంగా మారింది. మరోవైపు, “బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ తర్వాత పెళ్లి” అంటూ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యువ క్రికెటర్ తన ఆటతో మరింత విజయాలు సాధించి SRHను ముందుకు తీసుకెళ్తాడో లేదో వేచి చూడాలి!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..