Watch Video: టీమిండియా నయా ‘స్వింగ్ క్వీన్’.. బరిలో దిగితే ప్రత్యర్థులు పెవిలియన్‌కే.. ‘గేమ్ ఛేంజర్’ వీడియో మీకోసం..

|

Aug 04, 2022 | 9:55 AM

తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియాకు చెందిన ఓ బౌలర్ కూడా.. తన అద్భుత స్వింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించేందుకు స్ర్కిప్ట్ రాసింది. కేవలం 4 బంతుల్లో తన విజయ కథను రాసుకుంది.

Watch Video: టీమిండియా నయా స్వింగ్ క్వీన్.. బరిలో దిగితే ప్రత్యర్థులు పెవిలియన్‌కే.. గేమ్ ఛేంజర్ వీడియో మీకోసం..
Renuka Singh Thakur
Follow us on

క్రికెట్‌లో మ్యాచ్‌లో చివరి వరకు ఏం జరుగుతుందో తెలియన్ ఉత్కంఠత నెలకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క బంతితో ఎన్నో కీలక మలుపులు తిరిగిన మ్యాచ్‌లు కూడా చరిత్రలో ఉన్నాయి. అయితే, తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియాకు చెందిన ఓ బౌలర్ కూడా.. తన అద్భుత స్వింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించేందుకు స్ర్కిప్ట్ రాసింది. కేవలం 4 బంతుల్లో తన విజయ కథను రాసుకుంది.

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న టీమిండియా మహిళల క్రికెట్‌లో రేణుకా సింగ్ ఠాకూర్.. తన సూపర్ ఫాంతో ఆకట్టుకుంటోంది. హిమాచల్‌కు చెందిన ఈ ప్లేయర్ భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు అర్థంకాని పజిల్‌‌గా మారి, వికెట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. ఆమెను స్వింగ్ రాణి అని లేదా వికెట్ టేకింగ్ మెషిన్ అంటూ నెటిజన్లు పిలుస్తున్నారు. బంతితోనే విధ్వంసం సృష్టించడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. రేణుకా సింగ్ ఠాకూర్ బార్బడోస్‌పై కూడా అదే విధ్వంసం ప్రదర్శించింది. ఈ స్వింగ్ క్వీన్ వీడియోను ఓ సారి చూద్దాం..