Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWC 2023: ‘భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య సెమీఫైనల్‌ జరిగితే..’: మహ్మద్ కైఫ్ కీలక ప్రకటన..

పాకిస్థాన్ జట్టుతో పాటు, భారత మాజీ ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా కీలక విషయాలు ప్రకటించాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై కూడా నా కన్ను ఉంది. వారికి కఠినమైన మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించడం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాకు అంత సులభం కాదని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

CWC 2023: 'భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య సెమీఫైనల్‌ జరిగితే..': మహ్మద్ కైఫ్ కీలక ప్రకటన..
India Vs Pakistan Cwc 2023
Follow us
Venkata Chari

|

Updated on: Nov 07, 2023 | 9:30 PM

India vs Pakistan: ప్రపంచ కప్ 2023 (ICC Cricket World Cup 2023)లో భారత జట్టు విజయాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత జట్టు ఇప్పటికే సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు భారత (Indian Cricket Team) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ టిక్కెట్‌ను ఇంకా దక్కించుకోలేకపోయింది. పాక్‌ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఇంగ్లండ్‌పై భారీ విజయాన్ని నమోదు చేయాలి. కాగా, భారత మాజీ వెటరన్‌ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ (Mohammad Kaif) ఓ పెద్ద విషయం చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరి భారత్‌తో తలపడితే అది ఏకపక్షంగా సాగుతుంది..

స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన కైఫ్, పాకిస్తాన్ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరే అవకాశాల గురించి విశ్లేషించాడు. ‘వారు సెమీ-ఫైనల్‌కు చేరుకోవచ్చు. కానీ, ఇది ఏకపక్ష మ్యాచ్ అవుతుంది. ఏం జరిగిందో చూడాలని చరిత్ర పుటలు తెరుస్తున్నాను. వారిని భారత్ ఎప్పుడూ సులభంగానే ఓడించింది. సెమీఫైనల్‌కు చేరుకోవాలనే ఆశతో పాకిస్థాన్ ఉంది. ఇందుకోసం ఇంగ్లండ్‌పై అద్భుతమైన ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది. సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి పాకిస్థాన్‌కు మంచి నెట్ రన్ రేట్ అవసరం. వారు భారీ విజయాన్ని నమోదు చేసుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ జట్టుతో పాటు, భారత మాజీ ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా కీలక విషయాలు ప్రకటించాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై కూడా నా కన్ను ఉంది. వారికి కఠినమైన మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించడం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాకు అంత సులభం కాదని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య హోరాహోరీ పోరు జరిగిన విషయాన్ని గుర్తుచేద్దాం. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 191 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి సులభంగా గెలిచింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మరోసారి భారత్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..