ENG vs AFG: దంచి కొట్టిన ఆఫ్ఘాన్.. వన్డే ప్రపంచకప్ పవర్ ప్లేలో సరికొత్త రికార్డ్.. బలైన ఇంగ్లండ్ బౌలర్లు..

ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ టీం ఇంగ్లండ్‌కి 285 పరుగుల లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 49.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ 80 పరుగులు, ఇక్రమ్ అలీఖిల్ 58 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, మార్క్ వుడ్ 2 వికెట్లు తీశారు. అనంతరం 285 పరుగులతో ఛేజింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. జానీ బెయిర్‌స్టో కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు.

ENG vs AFG: దంచి కొట్టిన ఆఫ్ఘాన్.. వన్డే ప్రపంచకప్ పవర్ ప్లేలో సరికొత్త రికార్డ్.. బలైన ఇంగ్లండ్ బౌలర్లు..
Eng Vs Afg Records

Updated on: Oct 15, 2023 | 9:25 PM

Afghanistan Cricket Team: ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో భాగంగా 13వ మ్యాచ్‌లో ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ENG vs AFG) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ నిర్ణయం పూర్తిగా తప్పు అని ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ నిరూపించారు. పవర్‌ప్లేలో ఇంగ్లాండ్ బౌలర్లు ఘోరంగా ఓడిపోయారు. ఇబ్రహీం జద్రాన్‌తో కలిసి రహ్మానుల్లా గుర్బాజ్ ఇంగ్లీష్ బౌలర్లందరినీ లక్ష్యంగా చేసుకున్నారు. వీరిద్దరి తుఫాన్ బ్యాటింగ్ కారణంగా, ఆఫ్ఘనిస్తాన్ వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది.

రెహ్మానుల్లా గుర్బాజ్ మొదటి నుంచి ఇంగ్లండ్ బౌలర్లపై షాట్లు ఆడాడు. మరో భాగస్వామి ఇబ్రహీం జద్రాన్ పెద్దగా రిస్క్ తీసుకోలేదు. కానీ, తనకు లభించిన అవకాశాలను పరుగులు చేయడంలో మిస్ కాలేదు.

వన్డే ప్రపంచకప్‌లో మొదటి పవర్‌ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్..

ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి పవర్‌ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ఇది వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఆఫ్ఘాన్ జట్టుకు అత్యధికంగా నిలిచింది. ఈ సమయంలో, గుర్బాజ్ 31 బంతుల్లో 46 (నాటౌట్), జద్రాన్ 30 బంతుల్లో 22 పరుగులు అందించారు.

అంతకుముందు ప్రపంచ కప్‌లో, 2019లో న్యూజిలాండ్‌పై చేసిన మొదటి పవర్‌ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్తాన్ మొదటి 10 ఓవర్లలో 61/0 స్కోరు చేసింది. కానీ, తరువాత ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ తడబడింది. మొత్తం జట్టు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అదే సమయంలో, మొదటి పవర్‌ప్లేలో ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్స్ 59/1 స్కోర్ చేసిన ప్రస్తుత ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ మూడవ స్థానంలో నిలిచింది.

మ్యాచ్ పరిస్థితి..

ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ టీం ఇంగ్లండ్‌కి 285 పరుగుల లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 49.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ 80 పరుగులు, ఇక్రమ్ అలీఖిల్ 58 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, మార్క్ వుడ్ 2 వికెట్లు తీశారు.

అనంతరం 285 పరుగులతో ఛేజింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. జానీ బెయిర్‌స్టో కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. 37 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. మార్క్ వుడ్ 9, రషీద్ 18 పరుగులతో క్రీజులో నిలిచాడు. బ్రూక్ ఒక్కడే 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వాళ్లంతా తీవ్రంగా నిరాశపరిచారు.

ఇంగ్లండ్‌: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్.

ఆఫ్ఘనిస్థాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..