CSK vs DC: ఐపీఎల్ 2023లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు రాబట్టంది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఢిల్లీ టీమ్ కూడా 8 వికెట్లు నష్టపోయి నిర్ణీత 20 ఓవర్లలో 140 పరుగులే చేయగలిగింది. దీంతో ధోని సేన ఖాతాలో 27 పరుగుల తేడాతో మరో విజయం చేరింది. అయితే చెన్నై తరఫున అజింక్యా రహానే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఢిల్లీ ప్లేయర్ లలిత్ యాదవ్ ఒంటి చేత్తో పట్టిన మెరుపు క్యాచ్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకా ఈ క్యాచ్ ప్రత్యేకత ఏమిటంటే.. తన బౌలింగ్‌లోనే లలిత్ సూపర్ డైవ్ చేసి పట్టుకోవడం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఢిల్లీ తరఫున 12వ ఓవర్ వేయడానికి వచ్చిన లలిత్ యాదవ్ మొదటి బంతిని విసిరాడు. దాన్ని ఆడేందుకు క్రీజులో ఉన్న అజింక్యా రహానే స్ట్రైట్‌గా లో షాట్ కొట్టాడు. అంతే మెరుపు వేగంతో ముందుకు డైవ్ చేసి మరీ ఒంటి చేత్తో పట్టేసుకున్నాడు లలిత్. ఫలితంగా రహానే పెవిలియన్ బాట పట్టాడు. ఇక లలిత్ పట్టిన ఈ అసాధారణమైన క్యాచ్‌కు మైదానంలోని ప్రేక్షకులతో పాటు ఫీల్డ్ అంపైర్ క్రిస్ గఫానీ కూడా నోరెళ్లబెట్టేశాడు. క్యాచ్ ఏమో కానీ అంపై ర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ వీడియోకే హైలెట్‌గా నిలిచింది.
THAT. WAS. STUNNING! ? ?
Relive that sensational catch from @LalitYadav03 ? ?
Follow the match ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC | @DelhiCapitals pic.twitter.com/z15ZMq1Z6E
— IndianPremierLeague (@IPL) May 10, 2023
కాగా, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చెన్నై 2వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ధోని సేన 7 విజయాలను అందుకుంది. అలాగే ఐపీఎల్ 2023 సీజన్‌లో 11 మ్యాచ్‌లకు 4 మాత్రమే గెలిచిన వార్నర్ టీమ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..