AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs DC Score IPL 2021: ధోనీ వ్యూహానికి చెక్ పెట్టిన శిష్యుడు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

CSK vs DC Live Score in Telugu:ఐపీఎల్ 14 వ ఎడిషన్ (IPL 2021) రెండో మ్యాచ్ మొదలైంది. ఐపీఎల్‌-2021లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు..

CSK vs DC Score IPL 2021: ధోనీ వ్యూహానికి చెక్ పెట్టిన శిష్యుడు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..
Csk Vs Dc
Sanjay Kasula
|

Updated on: Apr 10, 2021 | 11:32 PM

Share

ఐపీఎల్2021లో తొలిసారి కెప్టెన్​ హోదాలో రిషభ్ పంత్​ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. శనివారం ముంబైలో జరిగిన మ్యాచ్​లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్​కింగ్స్​పై దిల్లీ క్యాపిటల్స్​ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఛేదనలో ధావన్, పృథ్వీషా అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా 189 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది పంత్​ సేన.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 23 సార్లు పోటీ పడ్డాయి. ఇందులో 15 విజయాలతో ధోనీసేన టాప్‌లో ఉంది. ఇక ఢిల్లీ 8 సార్లు గెలిచింది. ఇందులో ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. కాగా చివరి ఐదు మ్యాచులు మాత్రం హోరాహోరీగా జరిగాయి. 2020లో రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ విజయాన్ని అందుకుంది. 2019లో పూర్తిగా ధోనీసేనదే ఆధిపత్యం. రెండు లీగు మ్యాచులు, రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీని చిత్తు చిత్తుగా ఓటమిని మూటగట్టుకుంది. 

Key Events

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు

రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు, డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా, ధోని(కెప్టెన్‌) మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, శామ్‌ కరన్‌, బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌‌

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులు

శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, అజింక్య రహానె, రిషబ్‌ పంత్‌(కెప్టెన్‌), మార్కస్‌ స్టొయినిస్‌, హెట్‌ మెయిర్‌, వోక్స్‌, అశ్విన్‌, కరన్‌, అమిత్‌ మిశ్రా, అవేష్‌ ఖాన్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 10 Apr 2021 11:18 PM (IST)

    చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

    చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ విజయం సాధించింది. ధావన్‌(85 పరుగులు), పృథ్వీ షా(72 పరుగులతో మెరిసారు.

  • 10 Apr 2021 11:08 PM (IST)

    శిఖర్ ధావన్ ఔట్..

    ఠాకూర్‌ వేసిన ఓవర్‌లో మూడో బంతికి ధావన్‌(85) ఎల్బీగా వెనుదిరిగాడు. స్టోయినిస్ ఓ ఫోర్ బాదాడు. పంత్ క్రీజులో ఉన్నాడు.

  • 10 Apr 2021 11:05 PM (IST)

    పృథ్వీ ఔట్

    ధాటిగా ఆడుతున్న  పృథ్వీ షా(72 పరుగులు) మొయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ధావన్‌ 66, పంత్ క్రీజులో ఉన్నారు.

  • 10 Apr 2021 11:03 PM (IST)

    ఢిల్లీ 54 బంతుల్లో 76 పరుగులు

    విజయంకు ఢిల్లీ 54 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉంది. బ్రావో బౌలింగ్‌ వేస్తున్నాడు. తొలి బంతికి షా(58) సింగిల్‌ తీశాడు. రెండో బంతికి ధావన్‌(60) డరీ బాదాడు.

  • 10 Apr 2021 10:39 PM (IST)

    ధావన్ హాఫ్ సెంచరీ

    ఠాకూర్ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి బంతికి ధావన్‌ రెండు పరుగులు తీయడంతో ఢిల్లీ వంద పరుగులు దాటింది. ఆ తర్వాత డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌ నుంచి ఓ సింగిల్‌ కొట్టి ధావన్‌ కూడా హాఫ్ సెంచరీ చేశాడు.

  • 10 Apr 2021 10:36 PM (IST)

    సిక్సర్‌ కొట్టాడు శిఖర్ ధావన్‌

    మొయిన్‌ అలీ వేస్తున్న ఓవర్‌లో తొలి బంతికే సిక్సర్‌ కొట్టాడు శిఖర్ ధావన్‌. తర్వాత సింగిల్‌ తీశాడు. మూడో బంతికి షా ఇచ్చిన క్యాచ్‌ను గైక్వాడ్‌ వదిలేశాడు. ఆఖరు బంతికి షా ఫోర్‌ కొట్టి 27 బంతుల్లోనే  హాఫ్సెంచరీ చేశాడు.

  • 10 Apr 2021 10:19 PM (IST)

    ధావన్‌ హ్యట్రిక్‌ ఫోర్లు…

    శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రెండో బంతికి ధావన్‌ ఓ ఫోర్‌ కొట్టాడు. తర్వాతి బంతికి సింగిల్‌ తీశాడు. నాలుగో బంతికి షా ఆఫ్‌ సైడ్‌ సొగసైన బౌండరీ సాధించాడు. అయిదో బంతికి కూడా థర్డ్‌ మ్యాన్‌ దిశగా ఓ ఫోర్‌ కొట్టాడు. ఆఖరి బంతినీ వదలకుండా హ్యట్రిక్‌ ఫోర్లు బాదేశాడు.

  • 10 Apr 2021 10:05 PM (IST)

    ధావన్ బౌండరీ..

    సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో నాలుగో బంతికి ధావన్ చక్కటి బౌండరీ సాధించాడు. ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.

  • 10 Apr 2021 09:44 PM (IST)

    ధావన్ దూకుడు

    ధావన్‌ కూడా తగ్గడం లేదు.  తాను కూడా విరుచుకు పడుతున్నాడు. బంతికే ఫోర్‌ కొట్టాడు. మొదటి ఓవర్‌లో మొత్తం 9 పరుగులు వచ్చాయి.

  • 10 Apr 2021 09:43 PM (IST)

    మొదటి ఓవరల్‌ రెండో బంతి బౌండరీ..

    మొదలటి ఓవరల్‌లోనే బౌండరీలతో దుమ్ము రేపుతున్నారు ఢిల్లీ ఆటగాళ్లు.  దీపక్‌ చాహర్‌  వేసిన బౌలింగ్‌ రెండో బంతికి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా బౌండరీతో ఖాతా తెరిచాడు షా.

  • 10 Apr 2021 09:40 PM (IST)

    ఆట మొదలు పెట్టిన ఢిల్లీ..

    ఢిల్లీ ఛేజింగ్ మొదలు పెట్టింది. క్రీజ్‌లోకి ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌లు వచ్చారు.

  • 10 Apr 2021 09:16 PM (IST)

    19 ఓవర్లలో 23 పరుగులు

    19 వ ఓవర్లో చెన్నై 23 పరుగులు చేసింది. సామ్ కరణ్ ఈ ఓవర్లో టామ్ కరణ్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్‌లో సామ్ వరుసగా 2 సిక్సర్లు కొట్టాడు. అనంతరం 1 ఫోర్ కొట్టాడు. 

  • 10 Apr 2021 09:15 PM (IST)

    16 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 150 పరుగులు

    ఆరు వికెట్లను కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ 16 ఓవర్లలో 150 పరుగులు చేసింది.

  • 10 Apr 2021 08:58 PM (IST)

    ధోనీ బౌల్డ్

    ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఎదుర్కొన్న రెండో బంతికే బౌల్డ్ అయ్యాడు. సామ్‌ కరన్‌ బ్యాటింగ్‌కి వచ్చాడు.

  • 10 Apr 2021 08:57 PM (IST)

    రైనా రనౌట్‌

    అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి బంతికి డబుల్‌ తీసే ప్రయత్నంలో రైనా రనౌట్‌గా వెనుదిరిగాడు. ధోనీ క్రీజులోకి వచ్చాడు.

  • 10 Apr 2021 08:49 PM (IST)

    జడేజా అదిరిపోయిన ఎంట్రీ

    జడేజా తన ఎంట్రీని బౌండరీలతో మొదలు పెట్టాడు. స్టోయినిస్‌ బౌలింగ్‌.. జడేజా ఎదుర్కొన్న తొలి రెండు బంతులనూ బౌండరీలకు తరలించాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి.

  • 10 Apr 2021 08:47 PM (IST)

    రాయుడు ఔట్..

    టామ్‌ కరన్‌ వేసిన ఈ ఓవర్లో రాయుడు నాలుగో బంతికి ఫోర్‌ కొట్టాడు. మరో భారీ షాట్‌కి ప్రయత్నించి ధావన్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి జడేజా వచ్చాడు.

  • 10 Apr 2021 08:45 PM (IST)

     రైనా హాఫ్ సెంచరీ

    రైనా సిక్సర్‌తో  హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందుకు కేవలం 32 బంతులే తీసుకున్నాడు. రైనా ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

  • 10 Apr 2021 08:44 PM (IST)

    రాయుడ్ మరో సిక్స్…

    స్టోయినిస్‌ బౌలింగుకు దిగాడు. రైనా తొలి బంతికి సింగిల్‌ తీశాడు. తర్వాత బంతికి రాయుడు సిక్స్‌ కొట్టేశాడు.

  • 10 Apr 2021 08:39 PM (IST)

    మొదటి బంతికే సిక్స్

    రైనా దూకుడు మరింత పెంచాడు. మిశ్రా వేసిన తొలి బౌలింగ్‌లో రైనా మొదటి బంతికే సిక్స్‌ కొట్టాడు. రెండో బంతికి రెండు పరుగులు చేసి మూడో బంతికి మళ్ళీ డీప్ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ కొట్టాడు.

  • 10 Apr 2021 08:36 PM (IST)

    రాయుడు సిక్సర్..

    అశ్విన్‌ వేసిన  11వ ఓవర్లో తొలి బంతికే సిక్సర్‌ కొట్టాడు రాయుడు. మరో నాలుగు సింగిల్స్‌ రావడంతో మొత్తం ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి

  • 10 Apr 2021 08:33 PM (IST)

    అశ్విన్‌ దూకుడు

    మోయిన్‌ను కట్టడి చేసినా అశ్విన్ దూకుడు మరింత పెంచాడు. అశ్విన్‌ వేసిన  11వ ఓవర్లో తొలి బంతికే సిక్సర్‌ కొట్టాడు రాయుడు. మరో నాలుగు సింగిల్స్‌ రావడంతో మొత్తం ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.

  • 10 Apr 2021 08:31 PM (IST)

    మొయిన్‌ దూకుడుకు బ్రేక్..

    అశ్విన్‌ వేసిన 9వ ఓవర్‌ మొదటి రెండు బంతులకు రెండు సిక్సర్లు కొట్టాడు మొయిన్‌. ఆ వెంటనే భారీ షాట్‌కు ప్రయత్నించి ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.  రాయుడు క్రీజ్‌లోకి వచ్చాడు.

  • 10 Apr 2021 08:13 PM (IST)

    రైనా రెండు ఫోర్లు..

    అలీకి రైనా తోడయ్యాడు. అశ్విన్‌ వేసిన 5వ ఓవర్లో  మొయిన్‌ ఒక పరుగు, రైనా రెండు ఫోర్లు, ఓ సింగిల్‌ తీశారు.

  • 10 Apr 2021 08:03 PM (IST)

    మొయిన్‌ అలీ దూకుడు పెంచాడు.. రెండు ఫోర్లు కొట్టాడు..

    రెండు వికెట్లు పడి ఆందోళనలో ఉన్న చెన్నై జట్టుకు మొయిన్ అలీ ప్రాణం పోస్తున్నాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. అవేశ్‌ ఖాన్‌ వేసిన 4వ   ఓవర్లో వరుస బంతుల్లో మొయిన్‌ రెండు ఫోర్లు కొట్టాడు. చివరి బంతికి ఓ సింగిల్ తీయడంతో 9 పరుగులు వచ్చాయి.

  • 10 Apr 2021 08:00 PM (IST)

    మరో వికెట్ పడింది..

    వోక్స్‌ వేసిన 3వ ఓవర్లో‌ తొలి బంతికే గైక్వాడ్‌ ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సురేశ్‌ రైనా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేస్తున్నారు.  చెన్నై జట్టు 11పరుగుల వద్ద 2 వికెట్లను కోల్పోయింది.

  • 10 Apr 2021 07:48 PM (IST)

    చెన్నైకి మొదటి దెబ్బ

    చెన్నై మొదటి దెబ్బ తగిలింది. ఆవేశ్‌ ఖాన్‌ వేసిన 2 వ ఓవర్లో డుప్లెసిస్‌(0) LBWగా వెనుదిరిగాడు. మొయిన్‌ అలీ క్రీజ్‌లోకి వచ్చాడు.

  • 10 Apr 2021 07:45 PM (IST)

    బౌండరీతో ఆటమొదలు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్

    ఐపీఎల్‌ 14 వ సీజన్‌కు ఫోర్లతో బ్యాటింగ్ మొదలు పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. రితురాజ్‌ గైక్‌వాడ్‌ గొప్ప ఆరంభాన్ని ఇచ్చాడు.  

  • 10 Apr 2021 07:44 PM (IST)

    బ్యాటింగ్ మొదలు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్..

    చెన్నై బ్యాటింగ్ ప్రారంభమైంది. ఓపెనింగ్ జత రితురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్ మైదానంలో ఆడుతున్నారు.

  • 10 Apr 2021 07:32 PM (IST)

    టాస్ ఓడితే ఇలా చేద్దామని అనుకున్నాం- ధోనీ

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఢిల్లీ. అయితే ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ… టాస్‌ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ ఎంచుకుందామనుకున్నామని  అన్నాడు.

    చెన్నై జట్టు:  ధోని(కెప్టెన్‌)రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు, డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా,మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, శామ్‌ కరన్‌, బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌

  • 10 Apr 2021 07:29 PM (IST)

    ఢిల్లీ జట్టు సభ్యులు వీరే…

    టాస్‌ గెలిచిన ఢిల్లీ సారథి‌ రిషబ్‌ పంత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. యువకులు, అనుభవజ్ఞులతో తమ జట్టు సరిగ్గా ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. 2017 కొంతమేర సారథ్య బాధ్యతలు నిర్వహించినా… ఐపీఎల్2021‌లో ఇది తనకు తొలి గేమ్‌ అని అన్నాడు.

    ఢిల్లీ జట్టు సభ్యులు: రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు, డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా, ధోని(కెప్టెన్‌) మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, శామ్‌ కరన్‌, బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌

  • 10 Apr 2021 07:19 PM (IST)

    టాస్ గెలిచిన ఢిల్లీ..

    టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.

Published On - Apr 10,2021 11:18 PM