
Chennai Super Kings vs Delhi Capitals, 17th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌లో ఈరోజు డబుల్ హెడర్ (ఒక రోజు 2 మ్యాచ్‌లు) జరగనుంది. ఈ రోజు జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో.. ఈరోజు ఎంఎస్ ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని అంతా అనుకున్నారు. కానీ, రుతురాజ్ గైక్వాడ్ టాస్‌కి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
అదే సమయంలో, ఈ రోజు జరిగే రెండవ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కేఎల్ రాహుల్(w), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(సి), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(w), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరన.
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: శివమ్ దూబే, జామీ ఓవర్టన్, షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటి, నాథన్ ఎల్లిస్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: ముఖేష్ కుమార్, కరుణ్ నాయర్, దర్శన్ నల్కండే, డోనోవన్ ఫెరీరా, త్రిపురాన విజయ్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..