
MS Dhoni Uncapped IPL Captain: ఐపీఎల్ 2025లో 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. మరీ ముఖ్యంగా సీజన్ మధ్యలో ఎంఎస్ ధోని మళ్ళీ జట్టుకు నాయకత్వం వహిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఇప్పుడు అందరూ ఊహించనిది చోటు చేసుకుంది.
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి చెన్నై జట్టుకు కెప్టెన్ అయ్యాడు. దీంతో, ఐపీఎల్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విచిత్రం చోటు చేసుకుంది. దీంతో, ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్సీ వహించిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోని రికార్డు సృష్టించాడు.
అవును.. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి అన్‌క్యాప్డ్ ఆటగాడిగా ఎంఎస్ ధోనీ నిలిచాడు. నిజానికి, 5 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆటగాళ్లను లేదా 5 సంవత్సరాలుగా ఏ అంతర్జాతీయ ప్లేయింగ్ ఎలెవెన్‌లో భాగం కాని ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లుగా పరిగణిస్తారు.
టీమిండియా తరపున దాదాపు 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ధోని 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కానీ, జులై 2019 తర్వాత అతను ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఇలాంటి పరిస్థితిలో చెన్నై ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా జట్టులో రిటైన్ చేసుకుంది.
దీంతో పాటు ఐపీఎల్‌లో అత్యంత పెద్ద వయసు కెప్టెన్‌గా ధోనీకి గుర్తింపు కూడా ఉంది. ధోని ప్రస్తుతం 43 సంవత్సరాల 278 రోజుల వయస్సుతో తన పాత రికార్డును తానే బద్దలు కొట్టాడు. అంతకుముందు, 2023 ఐపీఎల్ ఫైనల్‌లో జట్టుకు నాయకత్వం వహించాడు. అతని వయస్సు 41 సంవత్సరాల 325 రోజులు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..