Dinesh Karthik: క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ తెలుగులో ఎలా మాట్లాడాడో చూశారా.? వైర‌ల్ అవుతోన్న వీడియో..

|

Oct 16, 2021 | 1:34 PM

Dinesh Karthik: క‌రోనా కార‌ణంగా మ‌ధ్య‌లో ఆగి మ‌ళ్లీ మొద‌లైన ఐపీఎల్ 14వ సీజ‌న్ ముగిసింది. శుక్ర‌వారం దుబాయి వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ్డ...

Dinesh Karthik: క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ తెలుగులో ఎలా మాట్లాడాడో చూశారా.? వైర‌ల్ అవుతోన్న వీడియో..
Dinesh Karthik
Follow us on

Dinesh Karthik: క‌రోనా కార‌ణంగా మ‌ధ్య‌లో ఆగి మ‌ళ్లీ మొద‌లైన ఐపీఎల్ 14వ సీజ‌న్ ముగిసింది. శుక్ర‌వారం దుబాయి వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ పోరులో చెన్నై 27 ప‌రుగుల‌తో గెలిచి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్ తెలుగులో మాట్లాడి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. స్టార్ మా తెలుగు కామెంట్రీలోనూ మ్యాచ్ ప్రత్య‌క్ష ప్ర‌సారాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా ప్ర‌ముఖ వ్యాఖ్యాత భోగ్లే.. కార్తీక్‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు. భోగ్లే తెలుగులో ప్ర‌శ్నించ‌గానే కార్తీ తెలుగులోనే స‌మాధానం ఇచ్చాడు.

అచ్చ‌మైన తెలుగులో ఎలాంటి త‌డ‌బాటు లేకుండా దినేష్ తెలుగు మాట్లాడిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఫైన‌ల్ మ్యాచ్‌ను కూడా సాధారణ మ్యాచ్‌లానే ఫైనల్‌ను పరిగణిస్తున్నామని, ఎలాంటి ఒత్తిడి లేదంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇక ఒత్తిడిని ఓవ‌ర్‌క‌మ్ చేయ‌డానికి ప్రాక్టిస్ చేశామ‌ని చెప్పిన దినేష్ కార్తీక్‌.. సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని చెప్పుకొచ్చాడు. దినేష్ కార్తీకి తెలుగులో మాట్లాడిన వీడియో ప్ర‌స్తుం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక ఇంట‌ర్వ్యూ చేసిన భోగ్లే.. దినేష్‌ను పొగుడుతూ ట్వీట్ చేశాడు.

Also Read: Mohan Babu: పదేపదే రెచ్చగొట్టకండి.. అందరం కలిసి పనిచేద్దామన్నమోహన్ బాబు

Bad breath: మీ నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. ఈ ఐదు కారణాలు కావచ్చు.. ఇలా చెక్ పెట్టండి..

Whatsapp Chat Backup: వాట్సాప్ యూజ‌ర్ల‌కు మ‌రో సూపర్ ఫీచ‌ర్‌.. ఇక‌పై చాట్స్ బ్యాక‌ప్‌లోనూ ఆ ఫీచ‌ర్.