భారత్‌ను పాక్ ఓడిస్తుంది… ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించి రికార్డు సృష్టిస్తుందన్నాడు ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌, మాజీ కెప్టెన్‌ ఇంజిమామ్‌-ఉల్‌-హక్‌. ఈ రెండు జట్లూ ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు ఆరుసార్లు తలపడగా.. అన్ని మ్యాచుల్లోనూ టీం ఇండియానే విజయం సాధించింది. దీంతో జూన్ 16న మాంచెస్టర్‌లో జరిగే పోరులో పాకిస్థాన్ తప్పకుండా గెలుస్తుందని ఇంజిమామ్ జ్యోస్యం చెప్పాడు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకుంటారని.. కొందరైతే ప్రపంచకప్‌లో ఇతర జట్లతో ఓడిపోయినా పర్వాలేదు కానీ.. […]

భారత్‌ను పాక్ ఓడిస్తుంది... ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: May 27, 2019 | 3:31 PM

పాకిస్థాన్‌ ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించి రికార్డు సృష్టిస్తుందన్నాడు ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌, మాజీ కెప్టెన్‌ ఇంజిమామ్‌-ఉల్‌-హక్‌. ఈ రెండు జట్లూ ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు ఆరుసార్లు తలపడగా.. అన్ని మ్యాచుల్లోనూ టీం ఇండియానే విజయం సాధించింది. దీంతో జూన్ 16న మాంచెస్టర్‌లో జరిగే పోరులో పాకిస్థాన్ తప్పకుండా గెలుస్తుందని ఇంజిమామ్ జ్యోస్యం చెప్పాడు.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకుంటారని.. కొందరైతే ప్రపంచకప్‌లో ఇతర జట్లతో ఓడిపోయినా పర్వాలేదు కానీ.. ఒక్క భారత్‌పై గెలిస్తే సంతోషిస్తామని అంటారని ఇంజిమామ్‌ పాక్‌కి చెందిన ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ప్రపంచకప్ అంటే భారత్, పాక్ మ్యాచ్ ఒక్కటే కాదని.. మిగతా జట్లపైనా గెలవాల్సిన అవసరముందని అన్నారు. ఇటీవల పాక్ జట్టులో చోటు చేసుకున్న మార్పులపై గుర్రుగా ఉన్న అతడు.. ప్రపంచకప్‌లో జట్టుని ఎంపిక చెయ్యడం అంత సులభతరం కాదన్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్టను ఎంపిక చెయ్యడం ఒత్తిడితో కూడుకున్న విషయమని చెప్పాడు.