LLC 2022: లెజెండ్స్ లీగ్ క్రికెట్ షెడ్యూల్ విడుదల.. 6 నగరాలు, 13 మ్యాచ్‌లు.. ఎప్పుటినుంచంటే?

లెజెండ్స్ లీగ్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 8 వరకు జరుగుతుంది. ఆరు నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లేఆఫ్‌లు, ఫైనల్‌కు వేదికలు ఇంకా ప్రకటించలేదు.

LLC 2022: లెజెండ్స్ లీగ్ క్రికెట్ షెడ్యూల్ విడుదల.. 6 నగరాలు, 13 మ్యాచ్‌లు.. ఎప్పుటినుంచంటే?
Llc 2022

Updated on: Aug 24, 2022 | 11:49 AM

Legends League Cricket 2022: రిటైర్డ్ క్రికెటర్లు ప్రారంభించిన లెజెండ్స్ క్రికెట్ లీగ్ (LLC) రెండో సీజన్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఈసారి ఈ లీగ్ భారతదేశంలో నిర్వహింనున్నారు. ఇది సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమై అక్టోబర్ 8న ముగుస్తుంది. ఈ లీగ్ దేశంలోని 6 నగరాల్లో జరగనుంది. వాటిలో 5 నగరాలు ప్రకటించారు. ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికను కూడా త్వరలో ప్రకటించనున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో కోల్‌కతా, న్యూఢిల్లీ, కటక్, లక్నో, జోధ్‌పూర్ సిటీలు ఉన్నాయి. భారత స్వాతంత్ర్యం 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని, కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ ఇండియన్ మహారాజాస్ (ఇండియా లెజెండ్స్) వరెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. జోధ్‌పూర్, లక్నో మినహా అన్ని మైదానాల్లో ఒక్కొక్కటి మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ రెండు మ్యాచ్‌లు ప్లాన్ చేశారు.

లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు, CEO రామన్ రహేజా మాట్లాడుతూ, “ అభిమానుల కోసం మరోసారి సందడి చేయబోతున్నాం. షెడ్యూల్ ప్రకటనతో మ్యాచ్‌లను ప్లాన్ చేసుకోవచ్చు. త్వరలో తేదీలతో పాటు మా టికెటింగ్ భాగస్వామిని కూడా ప్రకటిస్తాం. కొత్త ఫార్మాట్‌లో 10 దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లతో కూడిన జట్టుతో, అభిమానులు ఈ సంవత్సరం మైదానంలో గొప్ప సీజన్‌ను కలిగి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

లెజెండ్స్ లీగ్ షెడ్యూల్:

కోల్‌కతా: సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 18న

లక్నో: సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 22న

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 26న

కటక్: సెప్టెంబర్ 27న, 30న

జోధ్‌పూర్: అక్టోబర్ 1, అక్టోబర్ 3

ప్లే-ఆఫ్‌లు: అక్టోబర్ 5, అక్టోబర్ 7న – వేదిక త్వరలో ప్రకటించనున్నారు.

అక్టోబర్ 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.