Watch Video: 6,0,6,6,6.. ఒక ఓవర్‌లో 4 సిక్సర్లు.. పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్ చూశారా..

వెస్టిండస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తనదైన విధ్వంకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాది 24 పరుగులు రాబట్టాడు. కేవలం 19 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 మ్యాచ్ దీనికి వేదికయ్యింది.

Watch Video: 6,0,6,6,6.. ఒక ఓవర్‌లో 4 సిక్సర్లు.. పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్ చూశారా..
Trinbago Knight Riders Kieron Pollard
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 11, 2024 | 3:06 PM

వెస్టిండస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తనదైన విధ్వంకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాది 24 పరుగులు రాబట్టాడు. కేవలం 19 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచి తమ జట్టును గెలిపించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 మ్యాచ్ దీనికి వేదికయ్యింది. సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ పొలార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్‌‌ ఆడారు. క్రికెట్ ఆటలు అసలైన మజాను అభిమానులకు రుచిచూపించాడు. 19వ ఓవర్‌లో సెయింట్ లూసియా కింగ్స్ ఫేసర్ మాథ్యూ ఫోర్డ్ బౌలింగ్‌లో.. పొలార్డ్ నాలుగు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ మొత్తం ఏడు సిక్సర్లతో క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాడు.  నాలుగు వికెట్ల తేడాతో పొలార్డ్ సారథ్యంలోని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ విజయం సాధించింది.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి టార్గెట్‌ను ఛేదించింది. కీరన్ పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ టోర్నమెంటులో పొలార్డ్ జట్టుకి ఇది రెండో విజయం.

ఒకే ఓవర్‌లో 4 సిక్సర్లు బాదిన పొలార్డ్..వీడియో చూడండి