NZ Vs ZIM: 9 మ్యాచ్‌ల్లో 333 పరుగులు.. 390 రోజుల తర్వాత ధోని టీమ్‌మేట్ దుమ్మురేపే ఎంట్రీ.. ఎవరంటే.?

దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో ట్రై-సిరీస్ ఆడనుంది న్యూజిలాండ్ జట్టు. ఈ ట్రై-సిరీస్ కోసం ఇటీవల తమ జట్టును ప్రకటించింది కివిస్ బోర్డు. జేమ్స్ నీషమ్, డెవాన్ కాన్వే, మిచెల్ హే, టిమ్ రాబిన్సన్‌లను తిరిగి ఎంపిక చేసింది. గాయం కారణంగా ఫిన్ అలెన్ ఈ సిరీస్‌కి దూరం కానున్నాడు.

NZ Vs ZIM: 9 మ్యాచ్‌ల్లో 333 పరుగులు.. 390 రోజుల తర్వాత ధోని టీమ్‌మేట్ దుమ్మురేపే ఎంట్రీ.. ఎవరంటే.?
Nz Vs Zim Tri Series

Updated on: Jul 14, 2025 | 11:06 AM

జూలై 14 నుంచి దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం కివిస్ జట్టు.. తన ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో 9 మ్యాచ్‌ల్లో 37 సగటుతో 225 స్ట్రైక్ రేట్‌తో 333 పరుగులు చేసి.. అద్భుతంగా రాణించిన డెవాన్ కాన్వేకు టీ20 జట్టులో చోటు కల్పించింది కివిస్ బోర్డు. గాయంతో వైదొలిగిన ఫిన్ అలెన్ స్థానంలో అతడు తిరిగి చోటు దక్కించుకున్నాడు.

390 రోజుల తర్వాత కాన్వే పునరాగమనం..

390 రోజుల తర్వాత డెవాన్ కాన్వే న్యూజిలాండ్ టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. అతడు చివరిసారిగా జూన్ 17, 2024న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024లో పాపువా న్యూగినియాతో ఆడాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్‌లో ఫిన్ అలెన్ విస్ఫోటక ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై 51 బంతుల్లో 5 ఫోర్లు, 19 సిక్సర్లతో 151 పరుగుల చేశాడు. మిచెల్ హే, జేమ్స్ నీషమ్ కూడా న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం. యువ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ మిచెల్ హే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. ఇక నీషమ్ అంతర్జాతీయ అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు టిమ్ రాబిన్సన్‌ను కూడా జట్టులో స్థానం సంపాదించాడు.ఈ ట్రై సిరీస్ జట్టుకు మిచెల్ శాంట్నర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

న్యూజిలాండ్ జట్టు షెడ్యూల్..

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ జట్టు జూలై 16న దక్షిణాఫ్రికాతో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూలై 18న జింబాబ్వేతో రెండవ మ్యాచ్, జూలై 22న దక్షిణాఫ్రికాతో మూడవ మ్యాచ్ ఆడనుంది. ఇక కివిస్ తన చివరి మ్యాచ్ జూలై 24న జింబాబ్వేతో జరగనుంది. అలాగే ఈ సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్ జూలై 26న జరుగుతుంది.

ట్రై-సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు:

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, విల్ ఓరూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ మరియు ఇష్ సోధి

అడిషనల్ కవర్స్:

మిచ్ హే, జేమ్స్ నీషమ్, టిమ్ రాబిన్సన్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..