Vinod Kambli: సచిన్‌కు స్పెషల్ ట్రాక్‌పై కోచింగ్.. కాంబ్లీపై వివక్ష.. కోచ్ రమాకాంత్ అచ్రేకర్ అలా ఎందుకు చేశారంటే?
Ramakant Achrekar - Vinod Kambli: రమాకాంత్ అచ్రేకర్ భారత మాజీ క్రికెటర్లు వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్‌ల చిన్ననాటి కోచ్. వినోద్ కాంబ్లీ ప్రకారం, రమాకాంత్ అచ్రేకర్ తొలి రోజుల్లో సచిన్ కంటే తక్కువ ప్రాక్టీస్ చేయించేవాడు. వినోద్ కాంబ్లీని అచ్రేకర్ ఇలా ఎందుకు ఇలా చేశాడో తెలుసా?
Sachin Tendulkar – Vinod Kambli: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నాడు. వినోద్ కాంబ్లీ ఇటీవల కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్‌ను కలుసుకున్నాడు. రమాకాంత్ అచ్రేకర్ పరిచయం అవసరం లేని వ్యక్తి. రమాకాంత్ అచ్రేకర్ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలకు కోచ్‌గా ఉన్నారు. భారతదేశంలో క్రికెట్‌ను ప్రోత్సహించడంలో, ఆట స్థాయిని మెరుగుపరచడంలో అచ్రేకర్ ఎల్లప్పుడూ ప్రసిద్ధి చెందారు. వినోద్ కాంబ్లీ ఎల్లప్పుడూ తన చిన్ననాటి కోచ్ గురించి తన స్నేహితులకు సంబంధించిన ఒక వృత్తాంతాన్ని చెబుతుంటాడు. అందులో రమాకాంత్ అచ్రేకర్ ఎల్లప్పుడూ కాంబ్లీ కంటే సచిన్‌ను ఎందుకు ఎక్కువగా ప్రాక్టీస్ చేయిస్తాడో వివరించేవాడు.
అచ్రేకర్ సచిన్‌ను ఎందుకు ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తాడు?
మీడియా కథనాల ప్రకారం, వినోద్ కాంబ్లీ తన స్నేహితులకు ఎప్పుడూ ఒక కథ చెబుతుంటాడు. నిజానికి, రమాకాంత్ అచ్రేకర్ సార్ తనని, సచిన్‌ని తొలిరోజుల్లో ప్రాక్టీస్ కోసం తీసుకెళ్లేవారు. కానీ మైదానానికి చేరుకున్న తర్వాత, సచిన్ మూడు రకాల వికెట్లపై ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తుంటాడు. కాంబ్లీకి ఒక్క వికెట్ మాత్రమే దక్కింది. ఈ విషయాన్ని కాంబ్లీ చాలాసార్లు గమనించాడు.
ఆ తర్వాత, ఒకరోజు అతను అచ్రేకర్ సర్‌ని సచిన్‌ని వేర్వేరు వికెట్లపై ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నారంటూ అడిగేశాడు. దానికి అచ్రేకర్ సార్ స్పందిస్తూ సచిన్ ఇలాంటి విభిన్న వికెట్లపై ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని, అది నీకు అవసరం లేదని అంటూ సమధానమిచ్చేవాడు. అదే సమయంలో, సచిన్ కంటే వినోద్ సహజంగా ప్రతిభావంతుడైన ఆటగాడు అని అప్పట్లో ముంబై క్రికెట్‌తో సంబంధం ఉన్న చాలా మంది చెప్పేవారు.
పాఠశాలలో ప్రపంచ రికార్డు సృష్టించిన జోడీ..
వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ స్కూల్ డేస్ నుంచి కలిసి క్రికెట్ ఆడారు. టెండూల్కర్-కాంబ్లీ కూడా పాఠశాలలో ప్రపంచ రికార్డు సృష్టించారు. శారదాశ్రమ పాఠశాలకు ఆడుతూ వీరిద్దరూ 664 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యంలో కాంబ్లీ నాటౌట్‌గా 349 పరుగులు చేశాడు. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత, ఇద్దరు ఆటగాళ్లు రంజీలలో కలిసి ఆడారు. ఆపై టీమిండియాలో కూడా తమ స్థానాన్ని సంపాదించగలిగారు. కానీ, కాంబ్లీ అంతర్జాతీయ కెరీర్ సచిన్ కంటే ఎక్కువ కాలం నిలవలేకపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..