IPL 2023: 41 ఏళ్లలోనూ తగ్గేదేలే.. రంగంలోకి తలైవా ధోనీ.. 3 భారీ రికార్డులు బద్దలు?

MS Dhoni: గత కొంత కాలంగా వినిపిస్తున్న వార్తల మేరకు ఎంఎస్ ధోనీ తన చివరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఆడుతున్నాడని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే, ఇలాంటి వార్తలతో ధోనీకి ఈ ఐపీఎల్ ప్రత్యేకం కావడానికి కారణంగా నిలిచింది.

IPL 2023: 41 ఏళ్లలోనూ తగ్గేదేలే.. రంగంలోకి తలైవా ధోనీ.. 3 భారీ రికార్డులు బద్దలు?
Ms Dhoni

Updated on: Mar 31, 2023 | 7:33 PM

గత కొంత కాలంగా వినిపిస్తున్న వార్తల మేరకు ఎంఎస్ ధోనీ తన చివరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఆడుతున్నాడని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే, ఇలాంటి వార్తలతో ధోనీకి ఈ ఐపీఎల్ ప్రత్యేకం కావడానికి కారణంగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ.. ఈసారి ఐదోసారి తన జట్టుకు టైటిల్‌ను అందజేయాలనుకుంటున్నాడు. ఈ ఐపీఎల్‌లో ధోనీ కొన్ని వ్యక్తిగత విజయాలు కూడా సాధించే ఛాన్స్ ఉంది.

ధోనీ బ్యాటింగ్ మునుపటిలా ఉండకపోవచ్చు. గతంలో లాంటి స్పీడ్‌, ఫైర్‌ కనిపించనప్పటికీ.. ఈ మాజీ టీమిండియా ప్లేయర్‌ని ఏమాత్రం తక్కువ అంచనా వేయంలేం. ఈ 41 ఏళ్ల ఆటగాడు ఈ సీజన్‌లో మూడు పెద్ద రికార్డులను సాధించే ఛాన్స్ ఉంది. అవేుంటో ఒకసారి పరిశీలిద్దాం..

వికెట్ కీపర్‌ కం బ్యాటర్‌గా 5 వేల పరుగులు..

ఐపీఎల్‌లో ధోనీ 206 ఇన్నింగ్స్‌ల్లో 4978 పరుగులు చేశాడు. మరో 22 పరుగులు చేసిన తర్వాత, లీగ్‌లో 5000 పరుగుల మార్కును తాకిన తొలి పూర్తి-సమయం వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. 185 పరుగులు చేసిన తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో AB డివిలియర్స్‌ను వదిలి ఆరో స్థానానికి వస్తాడు.

ధోనీ మిషన్ 250..

ఐపీఎల్ ఆడిన గొప్ప వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ధోనీ. ఐపీఎల్‌లో అత్యధికంగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా ధోనీనే కావడం విశేషం. ధోనీ ఇప్పటివరకు మొత్తం 234 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సీజన్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడిగా నిలుస్తాడు. ఐపీఎల్‌లో 229 మ్యాచ్‌లు ఆడిన ఈ జాబితాలో ధోనీ తర్వాత దినేశ్ కార్తీక్ పేరు వచ్చి చేరింది.

250 సిక్సర్ల మార్క్..

ధోని పవర్ హిట్టింగ్ గురించి అందరికీ తెలిసిందే. సిక్సర్లు కొట్టే అద్భుతమైన సామర్థ్యం ఫ్యాన్స్‌లో పుల్ జోష్ నింపేస్తుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 229 సిక్సర్లు కొట్టిన ధోని ఈ సీజన్‌లో తన సిక్సర్ల సంఖ్యను 250కి చేర్చే అవకాశం ఉంది. 250 సిక్సర్లు బాదిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టిస్తాడు.

41 ఏళ్ల ధోనీకి ఈ సీజన్ ఎంతో ప్రత్యేకమైంది. అతని ఆటతీరు ఈ లీగ్‌లో అతని భవిష్యత్తును నిర్ణయిస్తుందని స్పష్టమైంది. ఈ మూడు లక్ష్యాలను సాధించగలిగితే, అతని ఫిట్‌నెస్ అద్భుతమైనది, సాటిలేనిదిగా మారనుంది. దీంతో IPL తదుపరి సీజన్‌లో కూడా ఆడటం ఖాయంగా నిలుస్తుంది.