CSK vs GT IPL 2023 Final: ధోని కంటే ముందే రిటైర్మెంట్ ప్రకటించిన హైదరాబాదీ ప్లేయర్.. ఇదే లాస్ట్ మ్యాచ్ అంటూ షాక్..

Ambati Rayudu Retirement: ముంబై ఇండియన్స్‌తో మూడుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న రాయుడు.. చెన్నైని రెండుసార్లు ఛాంపియన్‌గా చేయడంలో కూడా కీలక పాత్ర పోషించాడు.

CSK vs GT IPL 2023 Final: ధోని కంటే ముందే రిటైర్మెంట్ ప్రకటించిన హైదరాబాదీ ప్లేయర్.. ఇదే లాస్ట్ మ్యాచ్ అంటూ షాక్..

Updated on: May 28, 2023 | 6:28 PM

Ambati Rayudu Retirement:  ఐపీఎల్ 2023 ఫైనల్‌కు ముందు ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఈ టోర్నీ ఫైనల్ ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్‌కు గంటన్నర ముందు, చెన్నై ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. చెన్నైతో రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన వెటరన్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ ఫైనల్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని రాయుడు ప్రకటించాడు.

ఈ సీజన్, ముఖ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చివరిది అంటూ అంతా ఊహాగానాలు, ఆందోళన చెందుతున్నారు? ఫైనల్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటాడా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి సమాధానం అయితే, రాలేదు. కానీ ధోనీ కంటే ముందు, ఆయన టీంమేట్ రాయుడు ఈ ఐపీఎల్ కెరీర్‌లో చివరి మ్యాచ్ అని ప్రకటించి, షాక్ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో రిటైర్మెంట్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

‘2 గొప్ప జట్లు ముంబై, చెన్నై తరపున 204 మ్యాచ్‌లు, 14 సీజన్‌లు, 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు ఆడాను. ఇది చాలా పెద్ద ప్రయాణం. Ipl 2023లో ఈ రాత్రి జరిగే ఫైనల్ నా చివరి గేమ్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను నిజంగా ఈ గొప్ప టోర్నమెంట్‌ని ఆస్వాదించాను. అందరికీ ధన్యవాదాలు. నో యూ టర్న్ ‘ అంటూ ట్వీట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..