Watch Video: ప్రాక్టీస్ కోసం బైక్‌పై రాంచీ స్టేడియానికి ఎంఎస్ ధోని.. అదిరిపోయే ఫీచర్స్.. అవేంటో తెలుసా?

|

Feb 07, 2023 | 3:15 PM

MS Dhoni Viral Video: ధోని ఇప్పటికే IPL 2023 సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రాక్టీస్ కోసం ధోని తన బైక్‌పై రాంచీ స్టేడియం చేరుకున్న వీడియో వైరల్ అవుతోంది.

Watch Video: ప్రాక్టీస్ కోసం బైక్‌పై రాంచీ స్టేడియానికి ఎంఎస్ ధోని.. అదిరిపోయే ఫీచర్స్.. అవేంటో తెలుసా?
Ms Dhoni
Follow us on

MS Dhoni: భారత జట్టు మాజీ కెప్టెన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్‌లపై ఉన్న ప్రేమ ఎప్పుడూ కనిపిస్తుంది. అందుకే క్లాసిక్ బైక్‌లే కాకుండా సూపర్‌బైక్‌ల కలెక్షన్‌ను కూడా ఆయన షెడ్‌లో కనిపిస్తుంటాయి. ఐపీఎల్ రాబోయే సీజన్ కోసం ధోని ఇప్పటికే ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో తన TVS Apache RR310తో రాంచీ స్టేడియానికి చేరుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ధోనీ తొలిసారిగా ఈ టీవీఎస్ బైక్‌ను నడుపుతున్నాడంట. ఈ సమయంలో అతను ఏజీవీ హెల్మెట్ కూడా ధరించడం వీడియోలో చూడొచ్చు. ఈ బైక్ మోడల్‌ను BMW, TVS సంయుక్తంగా తయారు చేశాయి. బైక్ గురించి మాట్లాడితే, ఇది 313 సీసీ, ఇందులో సింగిల్ సిలిండర్ కాకుండా, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ అందించారు. ఈ బైక్ ఇంజన్ కారణంగా ఇతర బైక్‌ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ కేవలం 7.13 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఇవి కూడా చదవండి

మహేంద్ర సింగ్ ధోనీతో బైక్‌ల కలెక్షన్ గురించి మాట్లాడితే, యమహా RD 350 కాకుండా, ఆయన వద్ద RX 100 కూడా ఉంది. ఇవే కాకుండా సుజుకి షోగన్, హార్లే డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్, కవాసకి నింజా ZX-14R కూడా ధోనీ చెంత ఉన్నాయి.

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్..

ఐపీఎల్ 2023 సీజన్ మహేంద్ర సింగ్ ధోని ప్రొఫెషనల్ క్రికెట్ చివరి సీజన్ కావచ్చని తెలుస్తోంది. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్‌లో గతంలో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, జట్టు ప్రదర్శన చూసి మళ్లీ సీజన్ మధ్యలో ఈ బాధ్యతను నిర్వర్తించడం కనిపించింది.

ఇప్పుడు అందరి దృష్టి రాబోయే ఐపీఎల్ సీజన్‌పైనే ఉంది. గత సీజన్‌లో పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచిన చెన్నై టీం.. ఈసారి ధోనీకి అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటోంది. దీంతో ఈ సీజన్‌లో పాత చెన్నై సూపర్ కింగ్స్ ఆటను చూడొచ్చని అంతా భావిస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో, బెన్ స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో చేరాడు. ఇది జట్టుకు మరింత బలాన్ని చేకూర్చనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..