MS Dhoni Has Hit in Nets: ధోనీ సిక్సర్ల మోత.. ప్రాక్టీస్‌‌లో దుమ్మురేపుతున్న వీడియో వైరల్

|

Mar 12, 2021 | 1:38 PM

MS Dhoni has hit: ఐపీఎల్-14‌లో బ్యాట్‌ పరుగుల వరద పారించేందుకు అందరికంటే ముందే మైదానంలోకి అడుగు పెట్టాడు ధోనీ. కొద్దిరోజుల క్రితమే చెన్నైకి చేరుకున్న ధోనీ..

MS Dhoni Has Hit in Nets: ధోనీ సిక్సర్ల మోత.. ప్రాక్టీస్‌‌లో దుమ్మురేపుతున్న వీడియో వైరల్
Ms Dhoni
Follow us on

MS Dhoni During Practice: మహేంద్రసింగ్‌ ధోనీ బ్యాట్ పడితే ధనా ధన్.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ అడుగు పెడితే రికార్డుల మోత.. ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మళ్లీ నెట్స్​ ప్రక్టీస్‌లో తెగ బిజీగా మారిపోయాడు. ఐపీఎల్​ 14వ సీజన్​ కోసం బ్యాట్‌ పట్టి సిక్సులు పిచ్చెక్కిస్తున్నాడు.

ఎప్రిల్ నెల ప్రారంభమయ్యే ఐపీఎల్-14‌లో బ్యాట్‌ పరుగుల వరద పారించేందుకు అందరికంటే ముందే మైదానంలోకి అడుగు పెట్టాడు. కొద్దిరోజుల క్రితమే చెన్నైకి చేరుకున్న ధోనీ .. తాజాగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు.

ప్రాక్టీస్ మొదలు పెట్టిన మొదటి రోజే మైదానంలో సిక్సుల వర్షం కురిపించాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా ధోనీ పలు బంతులను స్టాండ్స్‌లోకి తరలించిన వీడియోను చెన్నై ఫ్రాంచైజీ ట్విట్టర్​ పోస్ట్ చేసింది.  దీంతో తమ అభిమాన ఆటగాడు ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  దీంతో ఇంది కాస్తా వైరల్ అయ్యింది.


ఎంఎస్ ధోనీ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. తర్వాత ఐపీఎల్-13 కోసం గత మార్చిలో చెన్నైకి చేరుకుని కొద్దిరోజులు ప్రాక్టీస్‌లో చేశాడు. అయితే.. అప్పుడు లాక్‌డౌన్‌ విధించడంతో ఐపీఎల్‌ ఆరునెలలు వాయిదా పడింది.

చివరికి 2020 సెప్టెంబర్‌-నవంబర్‌ కాలంలో యూఏఈలో లీగ్​ 13వ సీజన్​ జరిగింది. అంతకుముందే ధోనీ చెన్నైలో రెండోసారి శిక్షణా శిబిరం ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఇక తర్వాత ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన జట్టులో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటం, అదే సమయంలో రైనా, భజ్జీ లాంటి సీనియర్లు వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో చెన్నై గత సీజన్‌లో దారుణంగా విఫలమైంది. ధోనీ సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. టోర్నీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెన్నై సూపర్ కింగ్స్  జట్టు కనీసం ప్లేఆఫ్స్‌ చేరకుండానే ఇంటి దారి పట్టింది. మరి ఈ సీజన్‌లో ధోనీ సేన ఎలా ఆడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

Mithali Raj: హైదరాబాదీ క్రికెటర్ అద్భుతమైన రికార్డు.. ఇండియాలో టాప్.. వరల్డ్‌లో సెకెండ్

PM Kisan: రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.2 వేలు.. ఈ వివరాలు సబ్మిట్ చేశారో లేదో చూసుకోండి..