ఐపీఎల్-2021లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. రెండో దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించింది. ఢిల్లీ కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. రెండూ జట్లు 10 పాయింట్లతో ఉండగా మెరుగైన నెట్ రన్ రేటుతో సూపర్ కింగ్స్ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో క్యాపిటల్స్ ఉంది. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్‌తో తలపడిన చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లక్ష్యఛేధనకు దిగిన ముంబై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 136 పరుగులే చేసింది.
సెప్టెంబర్ 24న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాంటిగ్ చేసిన బెంగళూరు ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 11 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. నిన్న కోల్కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాంటింగ్ చేసిన కోల్కత్తా 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్‌కు దిగిన చెన్నై ఎమిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ కింగ్స్ ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఐపీఎల్-2021 మొదటి దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించింది చెన్నై.
రెండో దశలో రెండు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండింటిలోనూ గెలుపొందింది. సెప్టెంబర్ 22న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 134 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ 13 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. సెప్టెంబర్ 25న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 33 పరుగులు తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2021 మొదటి దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో విజయం సాధించింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Bigg Boss 5 Telugu: నన్ను ప్రేమించిన వాడు అర్థాంతరంగా చనిపోయాడు.. ఏడ్చేసిన సిరి..(వీడియో)
Viral Video: ఆత్మకూరులో 65ఏళ్ల వృద్ధుడి సహసం.. ఒంటి చేత్తో గుర్రం సవారీ.. వైరల్ అవుతున్న వీడియో..