
IPL 2024 Points Table after CSK vs KKR: సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. కాగా, ఈ విజయం సాధించినప్పటికీ ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అజేయంగా 67 పరుగులు చేసి CSK 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడింది.
ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానానికి ఎగబాకింది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అంతకుముందు రోజు, ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో మొదటి విజయం సాధించి ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు -1.370 NRRతో దిగువ స్థానంలో ఉంది.
| క్రమ సంఖ్య | జట్టు | ఆడింది | గెలిచింది | ఓడిపోయింది | పాయింట్లు | నెట్ రన్ రేట్ |
| 1 | రాజస్థాన్ రాయల్స్ | 4 | 4 | 0 | 8 | +1.120 |
| 2 | కోల్‌కతా నైట్ రైడర్స్ | 4 | 3 | 1 | 6 | +1.528 |
| 3 | లక్నో సూపర్ జెయింట్స్ | 4 | 3 | 1 | 6 | +0.775 |
| 4 | చెన్నై సూపర్ కింగ్స్ | 5 | 3 | 2 | 6 | +0.666 |
| 5 | సన్‌రైజర్స్ హైదరాబాద్ | 4 | 2 | 2 | 4 | +0.409 |
| 6 | పంజాబ్ కింగ్స్ | 4 | 2 | 2 | 4 | -0.220 |
| 7 | గుజరాత్ టైటాన్స్ | 5 | 2 | 3 | 4 | -0.797 |
| 8 | ముంబై ఇండియన్స్ | 4 | 1 | 3 | 2 | -0.704 |
| 9 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 5 | 1 | 4 | 2 | -0.843 |
| 10 | ఢిల్లీ క్యాపిటల్స్ | 5 | 1 | 4 | 2 | -1.370 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..