IND vs AUS: వీరికోసమైనా గెలవాలి.. మ్యాచ్‌ టికెట్ల కోసం అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ పడిగాపులు.. క్యూలైన్‌లో దుప్పట్లతో..

|

Mar 20, 2023 | 11:42 AM

మన దేశంలో క్రికెట్‌ అంటే ఒక ఆట కాదు. ఒక ఎమోషన్‌. అందుకే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి చూపుతారు. టీమిండియా జయాపజయాలతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా స్టేడియాలు మొత్తం అభిమానులతో నిండిపోతాయి.

IND vs AUS: వీరికోసమైనా గెలవాలి.. మ్యాచ్‌ టికెట్ల కోసం అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ పడిగాపులు.. క్యూలైన్‌లో దుప్పట్లతో..
Chennai Cricket Fans
Follow us on

మన దేశంలో క్రికెట్‌ అంటే ఒక ఆట కాదు. ఒక ఎమోషన్‌. అందుకే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి చూపుతారు. టీమిండియా జయాపజయాలతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా స్టేడియాలు మొత్తం అభిమానులతో నిండిపోతాయి. ఇటీవల భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లకు కూడా స్టేడియాలు నిండిపోవడం మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌కు ప్రత్యక్ష నిదర్శనం. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డే బుధవారం చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండు జట్లు 1-1 సమానంగా ఉండడంతో చెన్నై మ్యాచ్‌ సిరీస్‌ డిసైడర్‌గా మారింది. ఈక్రమంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే స్టేడియం టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఇలా సుమారు రెండు కిలోమీటర్ల మేర క్యూ నిలిచింది. కొందరు ఫాన్స్ క్యూ లైన్‌లోనే దుప్పట్లు కప్పుకొని కునుకు తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా కరోనా వైరస్‌ కారణంగా గత కొన్నేళ్లుగా చెన్నైలో ఐపీఎల్‌ సహా ఎలాంటి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు జరగలేదు. దీనికి తోడు చెన్నైలో క్రికెట్‌ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. అందుకే మ్యాచ్‌ టికెట్ల కోసం భారీగా పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే చెన్నై స్టేడియంలో టికెట్ల కౌంటర్ల వద్ద సరైన ఏర్పాట్లు లేవని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘దురదృష్టవశాత్తూ చెన్నైలో ప్రతిసారీ అభిమానులకు ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఇక్కడ పేలవమైన ఏర్పాట్లు ఉంటాయి. గతంలో ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్ కోసం ఏడు గంటల పాటు క్యూలో వేచి ఉండటం నాకు గుర్తుంది. అయినా కూడా టిక్కెట్ దొరకలేదు’ అని ఒక నెటిజన్‌ తన చేదు అనుభవాన్ని షేర్‌ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..